Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్‌ను కుదిపేస్తున్న ఘటన..
- 13 ఏళ్ల బాలికపై 30 మంది అత్యాచారం..
- రాజస్థాన్ శ్రీగంగా నగర్ జిల్లాలో దారుణం..
- హోటల్ మాఫియాపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగానగర్ జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. 13 ఏళ్ల బాలిక అక్రమ రవాణా, సామూహిక అత్యాచారం ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ, విద్యార్థి సంఘాలు తీవ్ర నిరనస కార్యక్రమాలు చేపట్టాయి. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఇంటి నుంచి తప్పిపోయిన 13 ఏళ్ల బాలికను స్థానిక రిక్షా డ్రైవర్ ఆశపెట్టి శ్రీగంగానగర్ లోని కొందరు హోటల్ యజమానులకు అమ్మేశాడు. కేవలం 5 రోజుల వ్యవధిలో హోటల్ య జమానాలు, మేనేజర్లు 30 మందికి పైగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యే రూపిందర్ సింగ్ కన్నార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ భారీ ప్రదర్శన నిర్వహించింది. పోలీసులు, హోటల్ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది పోలీసులు, నిఘా వ్యవస్థ వైఫల్యాన్ని బయటపెడుతోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన హోటల్ యజమానులు, రిక్షా డ్రైవర్‌కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ఈ వ్యవహారం ఆ జిల్లాలో జరుగుతున్న అక్రమ హోటళ్ల వ్యాపారాన్ని బట్టబయలు చేసింది. శ్రీ గంగానగర్ పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడ 150కి పైగా అక్రమ హోటళ్లు పనిచేస్తున్నారు. వీటిలో 40 హోటళ్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు ఉన్నాయి. మిగిలిన హోటళ్లకు ఎలాంటి పత్రాలు, నిబంధనలు లేవు. ఈ హోటళ్ల మాఫియాపై కూడా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..