Suriya: ‘హోంబాలే’తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya: వైవిధ్యభరితమైన పాత్రలతో, వైబ్రెంట్ నటనతో సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో సూర్య. ఇప్పుడు ఈ స్టార్ హీరోకు సంబంధించిన నెక్ట్స్ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబాలే ఫిలిమ్స్’ ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
‘సూర్య x హోంబాలే’ కాంబినేషన్లో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో సూర్య – జ్ఞానవేల్ కాంబినేషన్లో వచ్చిన ‘జై భీమ్’ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మరోసారి వీరిద్దరూ కలిసి ఒక పవర్ఫుల్, సామాజిక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్ టాలెంటెడ్ బ్యూటీ కయాదు లోహార్ ఎంపికయ్యారు. “మూడు దశాబ్దాలుగా వెండితెరపై కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సూర్యను మా గ్రాండెస్ట్ స్టేజ్‌పైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం” అంటూ హోంబాలే ఫిలిమ్స్ రిలీజ్ చేసిన నోట్లో పేర్కొంది. విజయ్ కిరగందూర్, చలువే గౌడ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కదిర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, రెగ్యులర్ షూటింగ్ అప్డేట్స్ వెల్లడి కానున్నాయి.
Also Read
The next chapter… #SuriyaXHombale
He built it.
Frame by frame. Film by film. Fight by fight.Roles that bled truth.
Characters that carried the weight of real lives.
A journey defined by courage, conviction, and craft.Three decades of truth on screen.
Countless hearts… pic.twitter.com/HoZOgQRbC7— Hombale Films (@hombalefilms) June 29, 2026
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!