Spa Center: బయట నుంచి చూస్తే అది స్పా సెంటర్.. కానీ, లోపల జరిగే తంతాంగం వేరే.. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పా సెంటర్ ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచారం గుట్టు రట్టు చేశారు పోలీసులు. రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్ లోని ఫెదర్ టచ్ స్పా అండ్ బ్యూటీ సెలూన్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఈ ఘటనలో 12 మంది ఉండగా 11 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో ముగ్గురు నిర్వాహకులు, నలుగురు విటులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. నిర్వాహకులలో ఒకరు పరారయ్యారు.. బాధిత మహిళలను ప్రభుత్వ ఉమెన్ హోమ్ కి తరలించారు.. నార్త్ స్టేట్స్ కు చెందిన మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం చేస్తున్నట్లుగా గుర్తించినట్లు రాజమండ్రి ప్రకాష్ నగర్ సీఐ ఎస్ కే బాజీలాల్ తెలిపారు. జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ ఆదేశాలతో స్పా సెంటర్లపై నిఘా పెడతామని అన్నారు. విటుల తరహాలో స్పా సెంటర్ కి వెళ్లి డెకాయిట్ ఆపరేషన్ నిర్వహిస్తామని వెల్లడించారు.. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తే ఆ సెంటర్ల యజమానులపై కేసులు పెడతామని హెచ్చరించారు..
Read Also: KTR vs Bandi Sanjay : బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా