Mumbai: ముంబైలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. కదులుతున్న టాక్సీలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే బాలిక తన కుటుంబ సభ్యులతో గొడవపడి, తన బంధువులను కలిసేందుకు మలాడ్ లోని మల్వాని వెళ్లాలని భావించింది. ఇదే సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై టాక్సీ డ్రైవర్ కన్నేశాడు. మల్వానిలో దించుతామని కారును దాదర్ వైపు పోనిచ్చి అక్కడ మరో నిందితుడు సల్మాన్ షేక్ ను ఎక్కించుకున్నాడు. ఇద్దరు నిందితులు బాలికపై ట్యాక్సీలోనే అత్యాచారం చేశారు.
Read Also: India-Canada: కెనడా వేదికగా.. ఖలిస్తానీ ఉగ్రసంస్థలతో పాక్ ఐఎస్ఐ రహస్య సమావేశం..
బాలిక అదృశ్యంపై కుటుంబ సభ్యులు మలబార్ హిల్ పోలీస్ స్టేసన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు బాలిక మలాడ్ ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. బాలికను తీసుకురావడనికి ఒక టీమును మలాడ్ పంపారు. అయితే విచారణలో మలాడ్ వెళ్తున్న సమయంలో టాక్సీ డ్రైవర్, మరో వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక వెల్లడించింది.
సీసీటీవీ ఫుటేజీతో సహా టాక్సీని, నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. ఈ సంఘటన దాదర్, మలాడ్ మధ్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. టాక్సీ డ్రైవర్ శ్రీ ప్రకాష్ పాండే(25), మరో నిందితుడు సల్మాన్ షేక్(27)లను పోలీసులు గుర్తించారు. సల్మాన్ షేక్ దాదర్ లోని ఓ హెటల్ లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా.. సెప్టెంబర్ 25 వరకు పోలీస్ కస్టడీ విధించారు.