Mumbai: ముంబైలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. కదులుతున్న టాక్సీలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే బాలిక తన కుటుంబ సభ్యులతో గొడవపడి, తన బంధువులను కలిసేందుకు మలాడ్ లోని మల్వాని వెళ్లాలని భావించింది. ఇదే సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై టాక్సీ డ్రైవర్ కన్నేశాడు.