దేశవ్యాప్తంగా భారీ పేలుళ్ల కుట్నను తెలంగాణ, ఏపీ పోలీసులు భగ్నం చేసిన విషయం విదితమే.. విజయనగరంలో ఒకరిని, హైదరాబాద్‌లో మరొకరని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఈ కేసులో ఎన్‌ఐఏ కూడా రంగంలోకి దిగింది.. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు వెలుగు చూడగా.. ఉగ్రవాద భావజాలం కలిగిన సిరాజ్ నుంచి అనేక ఆసక్తికర విషయాలు సేకరించారు పోలీసులు.. సిరాజ్ నాలుగు టార్గెట్‌లు పెట్టుకున్నట్టు పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.. దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి.. యువతను మతోన్మాదులుగా మార్చాలి..