కర్ణాటకలో దారుణం జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందని ఒక వివాహితుడు స్నేహితురాలిని సరస్సులోకి తోసేసి చంపేశాడు. ఈ సంఘటన బుధవారం హసన్ జిల్లాలోని చందనహళ్లి ప్రాంతంలో జరిగింది.
ఇది కూడా చదవండి: Rekha Gupta Attacked: ఆ ఆదేశాలతో ఢిల్లీకి వెళ్లా.. కానీ రేఖా గుప్తా పట్టించుకోలేదు.. నిందితుడు వెల్లడి
బాధితురాలు శ్వేత(32)-రవి చాలా ఏళ్ల క్రితం పనిలో కలుసుకున్నారు. రవి వివాహితుడు. శ్వేత భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న రవి.. కొన్ని నెలల నుంచి శ్వేతను స్నేహితురాలి ఉండాలంటూ అడుగుతున్నాడు. అవసరం అయితే భార్యను వదిలేసి నీతోనే ఉంటానని శ్వేతపై భారీగా ఒత్తిడి తెస్తున్నాడు. అయితే అతడు పెట్టిన ప్రతిపాదనను శ్వేత తిరస్కరించింది. శ్వేతను తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆమె తిరస్కరించడంతో పగ పెట్టుకున్నాడు. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదనుకున్నాడో ఏమో తిలియదు గానీ శ్వేతను తన కారు దగ్గరకు పిలిచి ఎక్కించుకున్నాడు. అనంతరం చందనహళ్లి సరస్సులోకి కారును పోనిచ్చాడు. రవి ఈదుకుంటూ పైకి వచ్చేయగా.. శ్వేత కారులో ఉండిపోయి ప్రాణాలు పోగొట్టుకుందని అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Archana Tiwari: నేపాల్ సరిహద్దులో అర్చన తివారీ ప్రత్యక్షం.. మిస్టరీ ఎలా వీడిందంటే..!
పోలీసుల విచారణలో తన కారు ప్రమాదవశాత్తూ సరస్సులో పడిపోయిందని రవి అబద్ధం చెప్పాడు. తాను ఈదుకుంటూ బయటపడ్డానని.. శ్వేత మాత్రం అలా చేయలేకపోయిందని చెప్పుకొచ్చాడు. శ్వేత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రవిని అరెస్ట్ చేశారు.
