Mudragada Padmanabham: సీఎ చంద్రబాబు, మంత్రి లోకేష్‌కి ముద్రగడ లేఖ.. కాపులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!
- సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ..
- చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు..
- కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టు బట్టలతో పంపించండి అంటూ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి (ముద్రగడ పద్మనాభం) ఘాటు లేఖ రాశారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాపు సమాజంపై జరుగుతున్న చర్యలు తీవ్ర అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టు బట్టలతో పంపించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
Read Also: Pakistan vs ICC: భారత్ మ్యాచ్‌కే బాయ్‌కాట్ ఎందుకు?.. పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిపై ఐసీసీ ఫైర్
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఇక, కాపు కులం చంద్రబాబుపై కోపంగా ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్ల ఉన్న ప్రేమతోనే టీడీపీకి మద్దతు ఇచ్చిందన్నది తన అభిప్రాయమని ముద్రగడ లేఖలో తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారని, అయితే పవన్ కల్యాణ్ మద్దతుతోనే వారు మళ్లీ రోడ్డెక్కారని వ్యాఖ్యానించారు. కాపు కులంపై చంద్రబాబు ఎప్పుడూ రగిలిపోతూనే ఉంటారని ఆరోపించిన ముద్రగడ, ప్రస్తుతం రాష్ట్రంలో గాడి తప్పిన రాక్షస పాలన కొనసాగుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇది దహన కాండను తలపిస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆశ్రయించి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన విధించాలని కోరితే, ప్రతిపక్ష నేతలను జైలులో పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులను అవమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అలాగే తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వం చెప్పిన మాటలు అబద్ధమని తేలిందని, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాపు అంశాన్ని హాట్‌టాపిక్‌గా మార్చింది.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!