Sudheer Babu’s ‘Harom Hara’ set for World Digital Premiere on Aha OTT: వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు సుధీర్ బాబు ‘హరోం హర’ సిద్ధం అయింది. సుధీర్ బాబు నటించిన తాజా యాక్షన్ డ్రామా ‘హరోం హర’. సాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో డిజిటల్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. మిశ్రమ సమీక్షలతో జూన్ 14న థియేటర్‌లలో విడుదలైన ఈ చిత్రం, జూలై 11, 2024 నుండి డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా OTT ప్రేక్షకులను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. హరోం హర” సుధీర్ బాబు కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి సినిమాగా నిలుస్తుంది.
Nabha Natesh: సినీ మీడియాకి నభా స్పెషల్ పార్టీ
ఇందులో తన మునుపటి సినిమాలతో పోలిస్తే ఒకడుగు ముందుకేసి యాక్షన్ సన్నివేశాలతో అలరించారు. సుబ్రమణ్యం అనే ప్రధాన పాత్రలో సుధీర్ బాబుతో పాటు, ఈ సినిమాలో మాళవిక శర్మ మహిళా కథానాయికగా నటించారు, సునీల్, జయప్రకాష్, రవి కాలే, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ మరియు ఒక ప్రముఖ యూట్యూబర్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్న ప్రణీత్ హనుమంతు ఈ సినిమాలో నటించారు. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహించగా, సుమంత్ జి నాయుడు నిర్మించిన ‘హరోం హర’ కుప్పం నేపథ్యంలో తెరకెక్కింది. జూలై 11, 2024 నుండి ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో ‘హరోం హర’ని చూడచ్చు.