హైదరాబాద్ లో ఘరానా మోసగాడు అరెస్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో ఘరానా మోసగాడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా రెండు వందల మంది అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు. న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. కొంతమందిని లొంగదీసుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు. ఐతే…ఎవరూ ఫిర్యాదు చేయకపోవటంతో ఈ వ్యవహారం కొంతకాలం పాటు సాగిపోయింది. ఓ బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించటంతో ఈ బండారం బట్టబయలైంది.
హైదరాబాద్‌లో కామాంధుడిని అరెస్ట్ చేసి..రిమాండ్‌కు తరలించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దాదాపు 200 మంది అమ్మాయిలను మోసం చేశాడు. వరంగల్ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్ధి అజయ్..ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. వారితో ఛాట్ చేసి న్యూడ్ ఫోటోలను కలెక్ట్ చేశాడు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో అజయ్ వ్యవహారం బట్టబయలైంది.
Also Read
- Instagram Love: ఇన్‌స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఇక…ఈ నరరూప రాక్షసుడిని విచారించిన పోలీసులు దిమ్మదిరిగే నిజాలు రాబట్టారు. తనను తాను అమ్మాయిగా ఫేక్ అకౌంట్‌తో పరిచయం చేసుకుంటాడు. న్యూడ్ ఫొటోలు పంపించకపోతే మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడతాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెద్ద ఎత్తున అమ్మాయిలను వేధించినట్లు పోలీసు విచారణలో తేలింది.
మరోవైపు..15 రోజుల క్రితం ఓ అమ్మాయి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు..దిల్‌సుఖ్‌నగర్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు వరంగల్ జిల్లా పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్‌గా గుర్తించారు. మల్టీమీడియా చదువుకుంటూ, నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ అమ్మాయిలను టార్గెట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!