హైదరాబాద్‌లో ఘరానా మోసగాడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా రెండు వందల మంది అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు. న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. కొంతమందిని లొంగదీసుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు. ఐతే…ఎవరూ ఫిర్యాదు చేయకపోవటంతో ఈ వ్యవహారం కొంతకాలం పాటు సాగిపోయింది. ఓ బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించటంతో ఈ బండారం బట్టబయలైంది. హైదరాబాద్‌లో కామాంధుడిని అరెస్ట్ చేసి..రిమాండ్‌కు తరలించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా…