Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anakapalli Tragedy: అనకాపల్లి జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం పెదమదిన గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన మైనర్ బాలిక, యువకుడు వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరూ పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నట్లు సమాచారం. పెదమదిన గ్రామానికి చెందిన మజ్జి రేవతి (16) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. రేవతి కొమ్మాదిలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిసింది.
అయితే, ఇదే సమయంలో రేవతి ఇంటికి పక్కనే నివసించే ఎర్రంశెట్టి కనక (25) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పురుగుల మందు సేవించిన కనకను కుటుంబ సభ్యులు, స్థానికులు చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే, మైనర్ బాలిక, యువకుడు పక్కపక్క ఇళ్లలో నివసించడంతో పాటు దాదాపు ఒకే సమయంలో ఆత్మహత్యలకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ రెండు ఘటనలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి మృతికి గల కారణాలు, ఘటనలకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒకే గ్రామంలో మైనర్ బాలిక, యువకుడు మృతి చెందడంతో పెదమదినలో విషాద వాతావరణం నెలకొంది.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
తాజావార్తలు
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!