Child Kidnap : బయటపడ్డ.. రిజ్వానా నర్సింగ్ హోమ్ రహస్యాలు..!
- చందానగర్‌లో చిన్నారి అదృశ్యం.. కీలక ముఠా వెలుగులోకి
- ముఠా నాయకుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ చిలుకూరి రాజు
- రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రదేశాలే లక్ష్యం
- ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసిన గ్యాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Kidnap: హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా నగరంలో పిల్లల కిడ్నాప్‌లకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆగస్టు 26న చందానగర్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. లింగంపల్లి పోచమ్మగూడెం వద్ద నాలుగేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడని తల్లి ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. దర్యాప్తులో పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముతున్న పెద్ద గ్యాంగ్ బయటపడింది.
USA: మోడీ-పుతిన్ మీటింగ్.. భారత్‌తో సంబంధాలపై అమెరికా కొత్త నిర్వచనం..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి ఆయుర్వేదిక్ మెడిసిన్ డాక్టర్ చిలుకూరి రాజుగా గుర్తించారు. అతనితో పాటు మహ్మద్ ఆసిఫ్, రిజ్వానా, నర్సింహ్మారెడ్డి కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి, రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రదేశాల్లో ఐదేళ్లలోపు చిన్నారులను కిడ్నాప్ చేస్తూ, పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఈ ముఠా ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణ అయింది. డీసీపీ వినీత్ వివరించిన ప్రకారం, ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న రిజ్వానా పిల్లల అమ్మకాలలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
ఆమెను కస్టడీలోకి తీసుకోవడం ద్వారా ఇంకా ఎంత మంది చిన్నారులను అమ్మారన్న విషయంపై స్పష్టత రానుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ముఠాతో పాటు బాల్రాజు అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అతడు తన ఇద్దరు పిల్లలను ఈ గ్యాంగ్‌కు అమ్మాడని విచారణలో తేలింది. అయితే కిడ్నాప్ చేసిన లాస్య, అమ్ములు అనే ఇద్దరు చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మిగిలిన నలుగురు చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
Sivaji: నారా లోకేష్ ‘ప్రజా గొంతుక’.. నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!