HYD DRUGS ARREST: డెడ్ డ్రాప్.. అట్టర్ ఫ్లాప్..
- హైదరాబాద్‌లో హైటెక్ పద్ధతులతో డ్రగ్స్ సరఫరా
- ఈగల్ ఫోర్స్ అధికారులు గచ్చిబౌలి పోలీసులతో కలిసి ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD DRUGS ARREST: స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. పుష్ప రేంజ్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాకు ప్లాన్ చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి అక్రమ దందాను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అలాంటి ముఠాలపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు.. ఒక రోజు కాకపోయినా మరో రోజైనా పట్టుకుంటున్నారు. తాజాగా కొత్త తరహాలో డ్రగ్స్ దందా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కొండాపూర్‌లోని వెంకటరమణ రెసిడెన్సీపై దాడి చేసి అంతర్రాష్ట్ర స్థాయిలో కోకైన్ సరఫరా చేస్తున్న యువకుడితో పాటు అతనికి సహకరిస్తున్న ఇద్దరు వ్యాపారవేత్తలను అరెస్టు చేశారు. నగరంలోని ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు.ప్రధాన నిందితుడిని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వేగేశ్న మురళీ కృష్ణంరాజుగా గుర్తించారు. ప్రస్తుతం కొండాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతనితో పాటు భూపతిరాజు చిరంజీవి వర్మ, రుద్రరాజు హేమంత్‌రాజు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారేని పోలీసులు తెలిపారు. ఐతే వారు డెడ్ డ్రాప్ పద్ధతిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.
Read Also: జీహెచ్‌ఎంసీ ‘MyCURE’ యాప్ లాంఛ్.. ఫిర్యాదులపై రియల్‌టైమ్ ట్రాకింగ్
Also Read
- Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
- Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
డెడ్ డ్రాప్ విధానంలో సరుకును ఎక్కడో ఒకచోట వదిలిపెడతారు. దాన్ని తీసుకునే వ్యక్తి ఎవరో సరఫరాదారుకి తెలియదు. వదిలిన వ్యక్తి ఎవరో కొనుగోలు దారికి తెలియదు. అయినా సరుకు చేరాల్సిన చేతికి చేరిపోతుంది. డబ్బులు కూడా ఆన్‌లైన్ ద్వారా మధ్యవర్తుల ఖాతాల మీదుగా సరైన చోటుకు చేరిపోతాయి. దీంతో నేరుగా సంప్రదింపులు లేకుండానే డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం డ్రగ్ పెడ్లర్లు ఎక్కువగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మురళీ కృష్ణంరాజు కూడా డ్రగ్స్ కస్టమర్లతో నేరుగా కలిసేవాడు కాదు. వైఫై ఆధారిత వాట్సాప్ కాల్స్, చాట్స్ ద్వారానే ఆర్డర్లు తీసుకునేవాడు. నగదు లావాదేవీలు చేయకుండా స్నేహితుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేయించి, అక్కడి నుంచి తనకు బదిలీ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఈ డెడ్‌డ్రాప్ వ్యవహారంపై కొండాపూర్‌లో ఈగల్ ఫోర్స్ పసిగట్టడంతో అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌తో పాటు మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు.
నైజీరియన్లతో పరిచయాలు పెంచుకున్న మురళీకృష్ణ
మురళీ కృష్ణంరాజు ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసి ఉత్తరాఖండ్, పుణే, గోవా వంటి రాష్ట్రాల్లో చిన్నచిన్న పనులు చేశాడు. ఆ సమయంలో నైజీరియన్లతో పరిచయాలు పెంచుకుని డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌లోకి అడుగుపెట్టాడు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి తన డెన్‌ను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించాడు. ధనిక వర్గాలను టార్గెట్‌గా చేసుకుని భారీగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. బెంగళూరు, ఢిల్లీ, గోవా నుంచి కోకైన్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ద్వారా హైదరాబాద్‌కు తరలించేవాడు మురళీకృష్ణ. డ్రైవర్లతో సెట్ అయి సరుకును హైదరాబాద్‌కు తెప్పించుకుని, రాపిడో బైక్ సర్వీసులు, కొరియర్ తరహా డెలివరీలతో వినియోగదారులకు చేరేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు. నిందితుడు చిరంజీవి వర్మ డ్రగ్స్ కొనుగోలు చేయడమే కాకుండా తన పరిచయస్తులకు మురళీ కృష్ణంరాజు నంబర్‌ను ఇచ్చి కస్టమర్లను పెంచాడు. మూడో నిందితుడు హేమంత్‌రాజు ఇటీవల కోకైన్ వినియోగం ప్రారంభించి ముఠాకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు… స్పాట్..
హైదరాబాద్‌లోని దాదాపు 15 మంది ప్రముఖులకు ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరికొందరు వినియోగదారుల వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌పై మరింత సమాచారం కోసం దర్యాప్తు కొనసాగుతోందంటున్నారు పోలీసులు. హైదరాబాద్‌లో హైటెక్ పద్ధతులతో సాగుతున్న డ్రగ్స్ వ్యాపారంపై పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్‌లో పర్యటన!
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!