Gang Rape: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలు ( 9,12 ఏళ్ల వయస్సు) ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్‌లో గ్యాంగ్‌రేప్‌కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Kidnap : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీ సౌమ్య.. కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఒక్క రోజులోనే కేసును ఛేదించారు. కిడ్నాపర్లతోపాటు శ్రీ సౌమ్యను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా శరభవరం సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీసౌమ్య కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. ఆమెతోపాటు ఆమెను ఎత్తుకెళ్లిన నిందితులను కూడా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్…
MLA Vemireddy Prashanthi Reddy Slams YS Jagan: మహిళలను కించపరిచే వ్యక్తులను పరామర్శిస్తూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ సైంధవుడిలా రాష్టాభివృద్ధిని అడ్డుకుంటుంటే.. అనిల్ కుమార్, ప్రసన్న కుమార్ రెడ్డిలు నెల్లూరు జిల్లా పాలిట సైంధవులయ్యారని విమర్శించారు. తల్లిని, చెల్లిని వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగం అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్…
రస్తుం మైన్స్ పార్ట్ టూ స్టార్ట్ అయిందా? క్లైమాక్స్ దిశగా పోలీసుల అడుగులు పడుతున్నాయా? మరో మాజీ మంత్రి కోసం పోలీస్ స్కెచ్ రెడీ అయిందా? ఇక ఏ క్షణాన్నయినా అరెస్ట్ వార్త వినే అవకాశం ఉందా? ఏంటా పార్ట్ టూ? ఎవరా మాజీ మంత్రి? నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. తెల్లరాళ్ళు ఎగిరి ఎటెటో తిరిగి… ఇప్పుడు అంతా ఊహిస్తున్న వైపే పడుతున్నాయట. మైనింగ్ బ్లాస్ట్‌కు ఎగిరొచ్చి పడుతున్న క్వార్ట్జ్…
Congress Leader Murder Case: మెదక్ జిల్లా కాంగ్రెస్ యువ నేత అనిల్ కుమార్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ హత్య కేసును ఛేదించడానికి నాలుగు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు.
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో మూడు విడతలుగా మాజీ ఇంటెలిజెన్స్ అధికారితో పాటు ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావును విచారించిన సిట్, ఆయన నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించడంలేదని అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు దక్కిన రిలీఫ్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ యోచిస్తోంది. ఇప్పటికే ఆయనపై విచారణలో ఎదురవుతున్న ఇబ్బందుల…
అధికారం చేతిలో ఉన్నప్పుడు అంతన్నాడింతన్నాడు. నా అంతటోళ్ళు లేరన్నాడు. రాజకీయ ప్రత్యర్థుల మీదికి తొడగొట్టాడు. మీసం మెలేశాడు…. కట్ చేస్తే ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయారా మాజీ మంత్రి. దాంతో వేషాలన్నీ పవర్ ఉన్నప్పుడేనా? అంతా గాలి బుడగ సామెతేనా అంటూ సెటైర్స్ పడుతున్నాయట. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏంటా కహానీ? నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. కార్పొరేటర్‌గా ఉన్న తన బాబాయ్ చనిపోవడంతో……
ప్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయల స్కాంకు తెరలేపారు మేము అధికారంలోకీ రాగానే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహబుబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రేమ్ రంగారెడ్డి గార్డెన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 0 బిల్లులతో ప్రతి పేదవాడి కరెంట్ బిల్లుల లేకుండా చేస్తున్నామన్నారు. భధ్రాచలం రాములవారి సన్నిధి నుండే…
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి మరో షాక్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యే జి. మహిపాల్ రెడ్డి సోమవారం అధికార కాంగ్రెస్‌లో చేరారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే ఎ. రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మంత్రులు దామోదర రాజనరసింహ, పి.శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌కు మారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమైన కాంగ్రెస్ మాజీ నేత గాలి అనిల్‌కుమార్ కూడా తిరిగి…
మాజీ మంత్రి అనిల్ కుమార్ మాటలు తగ్గించాలని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసం పదవులు కోసం అర్రులు చాచే మనస్తత్వం తనది కాదన్నారు. అధికారం ఉన్నప్పుడు విర్రవీగే, భజనలు చేసే మనస్తత్వం తనకు లేదని తెలిపారు. అనిల్ తో ఎవరు మాట్లాడిస్తున్నారో తనకు తెలుసని చెప్పారు. 2014లో తనను ఎవరు ఓడించారో కూడా తెలుసని పేర్కొన్నారు. ఆ విషయాలు తెలియక అనిల్ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.