Honey Trap: హైదరాబాద్‌లో మరోసారి ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా మోసం జరిగింది. హింజ్ (Hinge) అనే డేటింగ్ యాప్‌లో శివాని పేరుతో ఓ యువతితో పరిచయం పెంచుకున్న ఒక యువకుడు సైబర్ నేరగాళ్లకు బలయ్యాడు. అమ్మాయి పూణే నుంచి హైదరాబాద్‌కు వచ్చానని, మూడు రోజుల పాటు నగరంలో ఉంటానని చెప్పి బుట్టలో వేసుకుంది. ఆ తర్వాత తరచూ వీడియో కాల్ చేస్తూ అతడి ఫోటోలను సేకరించింది. ఆపై వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి అందరికీ షేర్ చేస్తామని బెదిరించారు.
ChatGPT Go: చాట్జీపీటీ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్!
ఈ బెదిరింపులకు భయపడ్డ యువకుడు, వారి మాటలు నమ్మి ఏకంగా లక్షా 80 వేల రూపాయలను పలు దఫాలుగా బదిలీ చేశాడు. అయితే, అంతటితో ఆగకుండా మోసగాళ్లు మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో చివరికి బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీనితో అసలు బండారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాల పెరుగుతున్న దృష్ట్యా పోలీసులు ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పదమైన పరిచయాలను నమ్మకూడదని సూచించారు.
Honor X7c 5G: IP64 రేటింగ్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో కొత్త హానర్ స్మార్ట్ ఫోన్ లాంచ్!