ChatGPT Go: చాట్జీపీటీ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్!
- చాట్జీపీటీ వినియోగదారులకు శుభవార్త..
- ఇకపై తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్.
- OpenAI భారత్‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ChatGPT Goను ప్రకటన
- నెలకు కేవలం రూ.399 ధరతో అందుబాటులోకి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ChatGPT Go: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం OpenAI భారత్‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ChatGPT Goను ప్రకటించింది. ఇది ప్రస్తుతం ఉన్న ChatGPT Plusకు తక్కువ ధరలో ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చింది. దీని మొదటగా భారత మార్కెట్‌లో లాంచ్ చేయగా.. అతి త్వరలో ఇతర దేశాలకు కూడా విస్తరించనుంది. OpenAI ప్రకారం.. ChatGPT Go సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులు ఎక్కువ మెసేజ్ లిమిట్స్, పెద్ద ఫైల్ అప్‌లోడ్స్, విస్తృతమైన ఇమేజ్ జనరేషన్, అడ్వాన్స్‌డ్ డేటా అనలిటిక్స్, ఇంకా ఎక్కువ మెమరీ ఫీచర్లను పొందవచ్చు. దీని వల్ల వినియోగదారులకు మరింత స్పష్టమైన సమాధానాలు లభిస్తాయి.
ChatGPT Go భారతదేశంలో నెలకు కేవలం రూ.399 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇది ChatGPT Plus నెలకు రూ. 1,999తో పోలిస్తే చాలా తక్కువ ధర ఉంది. ఈ ప్లాన్ వెబ్, iOS, ఆండ్రాయిడ్, అలాగే డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్‌లపై లభిస్తుంది. ప్రస్తుతం ఇది భారత మార్కెట్‌కే పరిమితం చేయబడింది. వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ ధరలను నేరుగా భారత కరెన్సీ లోనే చెల్లింపులు, క్రెడిట్ కార్డు లేదా UPI ద్వారా చేయవచ్చు. అయితే API వినియోగం ఈ ప్లాన్‌లో ఉండదు.. అది వేరుగా బిల్లింగ్ అవుతుంది.
Also Read
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
Honor X7c 5G: IP64 రేటింగ్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో కొత్త హానర్ స్మార్ట్ ఫోన్ లాంచ్!
సబ్‌స్క్రైబ్ చేయడం ఎలా?
ChatGPT Go సబ్‌స్క్రిప్షన్ పొందడం చాలా సులభం. ముందుగా వినియోగదారులు ChatGPT వెబ్ లేదా మొబైల్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత స్క్రీన్ కుడి కింద మూలలో ఉన్న ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి Upgrade Plan ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ Try Go ఎంపిక చేసి.. చెల్లింపు పూర్తి చేస్తే సబ్‌స్క్రిప్షన్ యాక్టివ్ అవుతుంది.

ఈ ప్లాన్ ద్వారా ఉచిత ప్లాన్‌లో ఉన్న అన్ని ఫీచర్లతో పాటు మరిన్ని అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా 10 రెట్లు ఎక్కువ మెసేజ్ లిమిట్స్, ఇమేజ్ జనరేషన్స్, ఫైల్ అప్‌లోడ్స్ సౌకర్యం ఉంటుంది. వినియోగదారులు GPT-5 మోడల్‌తో విస్తృతమైన యాక్సెస్ పొందగలరు. అలాగే పెద్ద డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు విశ్లేషించడానికి ఇది సపోర్ట్ చేస్తుంది.
ఇకపైథాన్ వంటి డేటా అనలిసిస్ టూల్స్‌కు కూడా అధిక లిమిట్స్ లభిస్తాయి. ఎక్కువ కాన్టెక్స్ట్ విండో కారణంగా సుదీర్ఘ సంభాషణలను గుర్తుంచుకోవడం సులభమవుతుంది. అంతేకాకుండా ప్రాజెక్ట్స్, టాస్క్స్, కస్టమ్ GPTs యాక్సెస్ ద్వారా వినియోగదారులు తమ పనిని మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు.
Miss Universe India 2025: ‘మిస్ యూనివర్స్ ఇండియా’గా మణిక విశ్వకర్మ!
పరిమితులు:
ChatGPT Go ప్లాన్‌లో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో Sora వీడియో-జనరేషన్ మోడల్ అందుబాటులో ఉండదు. అలాగే Codex Agent కూడా ఇందులో భాగం కాదు. అంటే కోడ్‌బేస్‌పై ప్రశ్నలు అడగడం, కోడ్‌ను నేరుగా ఎగ్జిక్యూట్ చేయడం, పుల్ రిక్వెస్ట్‌లను ఆటోమేటిక్‌గా డ్రాఫ్ట్ చేయడం వంటి అవకాశాలు లభించవు.
ఈ సందర్భంగా OpenAI ChatGPT హెడ్ నిక్ టర్లే మాట్లాడుతూ.. ChatGPTని మరింత చౌకగా అందుబాటులోకి తేవాలని వినియోగదారులు కోరారు. అందుకే భారత్‌లో మొదటగా Go ప్లాన్ ప్రారంభించాం. ఇక్కడి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా త్వరలో ఇతర దేశాలకు కూడా తీసుకెళ్తాం అని తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!