Harish Shankar: ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి బ్రేక్? ‘రైడ్’తో రెడీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగల్ లైనర్స్ ని సూపర్బ్ రాయడంలో, హీరో క్యారెక్టర్ తోనే హిట్ కొట్టడంలో పూరి జగన్నాథ్ తర్వాత అంతటి డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రమే. హరీష్ శంకర్ ఒక హీరోకి లో యాంగిల్ షాట్ పెట్టి, ఒక వన్ లైనర్ డైలాగ్ వదిలితే చాలు థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ విజిల్స్ వేయాల్సిందే. అరెవో సాంబ రాస్కోరా అంటూ గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన హరీష్ శంకర్. మళ్లీ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ మెగా ఫాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. ఆ అంచనాలకి తగ్గట్లు ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి యుట్యూబ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసారు. ఒక్క గ్లిమ్ప్స్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలని పెంచిన హరీష్ శంకర్, మరోసారి పవన్ కళ్యాణ్ తో ఇండస్ట్రీ హిట్ కొడతాడు అనే నమ్మకం అందరిలో కలిగింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ OG సినిమా కంప్లీట్ చేస్తూనే పాలిటిక్స్ లో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి కష్టమవుతుంది అనే బ్రేక్ ఇచ్చారనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఇందులో ఎంత నిజముంది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది కానీ ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్ ప్రకారం అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కి బ్రేక్ పడింది, హరీష్ శంకర్ ఇంకో సినిమాని సెట్ చేసే పనిలో ఉన్నాడు. హిందీలో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని మాస్ మహారాజ రవితేజతో హరీష్ శంకర్ రీమేక్ చేయబోతున్నాడట. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి హరీష్ శంకర్ కలిస్తే ఎలా ఉంటుందో మిరపకాయ్ సినిమాలో చూసేసారు కాకపోతే మిరపకాయ్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది కానీ రైడ్ సినిమా సీరియస్ డ్రామా. ఒకవేళ రవితేజ-హరీష్ శంకర్ రూమర్ నిజమైతే సీరియస్ ఎమోషన్ ని రవితేజతో హరీష్ శంకర్ ఎంత వరకూ ఫుల్ ఆఫ్ చేస్తాడు అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!