అక్కినేని నాగ చైతన్య కెరీర్ ని మళ్లీ సెట్ చేసుకునే పనిలో పడ్డాడు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చిన నాగ చైతన్య, సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అక్కినేని ఫాన్స్ ని మళ్లీ జోష్ లోకి తీసుకోని రావాలి అంటే చైతన్య హిట్ ట్రాక్ ఎక్కాల్సిందే. 2024ని సాలిడ్ గా హిట్స్ కొట్టడానికి రెడీ అయిన యువసామ్రాట్ ఒకేసారి సూపర్ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ప్రేమమ్ సినిమాతో హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న చందూ మొండేటి, నాగ చైతన్యతో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. జాలర్ల నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ గ్యాప్ లో చైతన్య, శివ నిర్వాణని కూడా సెట్ చేసాడని సమాచారం. మజిలీ సినిమాతో నాగ చైతన్యకి శివ నిర్వాణ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు.
చైతన్యకి ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చెయ్యగల శివ నిర్వాణ కూడా విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాడు. ఈ మూవీ పీసోత్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే చైతన్య-శివ నిర్వాణ కలిసి ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడానికి రెడీ అయ్యారు. డేట్స్ విషయంలో క్లాష్ రాకుండా… చందూ మొండేటి, శివ నిర్వాణ సినిమాలని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూట్ చేసే ప్లాన్ చేస్తున్నారట. సైమల్టేనియస్ గా రెండు సినిమాలని మొదలు పెడితే, 2024లోనే రెండు సినిమాలని రిలీజ్ చేసి సూపర్బ్ కంబ్యాక్ ఇవ్వాలనేది నాగ చైతన్య ప్లాన్. రెండు పాన్ ఇండియా సినిమాలు, ఒకటేమో యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఇంకొకటి ఏమో ప్రేమ కథ కాబట్టి చైతన్యకి కూడా మంచి వేరియేషన్ చూపించినట్లు అవుతుంది.