ED Raids: మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు..
- విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ నివాసంలో ఈడీ సోదాలు..
- ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలోనూ తనిఖీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Raids: విశాఖపట్నం మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.. లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలో కూడా ఏక కాలంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.. అయితే, హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్, కన్‌స్ట్రక్షన్స్ కార్యాలయాల్లోనూ ఈడీ రైడ్స్ సాగుతున్నాయి.. మధురవాడ భూమి కొనుగోలు కేసులో సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. రూ.12.5 కోట్ల లావాదేవీల వ్యవహారంలో ఎంవీవీపై ఈడీ కేసు నమోదు అయ్యింది.. ఎండీ జగదీశ్వరుడు, హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్ ఓనర్ రాధారాణి ఇళ్లల్లో కూడా ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు..
Read Also: Teaser Release : ‘భవానీ వార్డ్ 1997’ టీజర్ విడుదల చేసిన సత్యం రాజేష్
Also Read
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ఇక, తెలుగులో పలు చిత్రాలు నిర్మించారు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ… గీతాంజలి, అభినేత్రి, నీవెవరు లాంటి సినిమాలు తీశారు ఎంవీవీ.. ఈ నేపథ్యంలో 2006-2008 మధ్య జరిగిన లావాదేవీలపై కూడా ఈడీ కేసు నమోదు చేసింది.. ఎంవీవీ ఆడిటర్ వెంకటేశ్వరరావుతో పాటు గద్దె బ్రహ్మాజీ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన అధికారుల బృందాలు.. అయితే సోదాల సమయంలో ఎంవీవీ ఇంటి గేటుకు తాళాలు వేశారు సిబ్బంది.. ఈ సమయంలో ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో లేరని చెబుతున్నారు.. ల్యాండ్ గ్రాబింగ్, పలు అవినీతి ఆరోపణలు నేపథ్యంలో ఈడీ అధికారుల సోదాలకు ప్రాధాన్యత ఏర్పడింది..
తాజావార్తలు
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!