TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త సినిమాలను థియేటర్లలో రహస్యంగా రికార్డ్ చేసి, ఆన్లైన్లో లీక్ చేస్తున్న పైరసీ ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రట్టు చేసింది. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఇద్దరు విద్యార్థులు, సంతోష్ నగర్‌కు చెందిన షేక్ రిజ్వాన్ (19), భగత్ సింగ్ నగర్‌కు చెందిన రాంపోగు అజయ్ (19)లను టీజీసీఎస్బీ యాంటీ పైరసీ యూనిట్ నవంబర్ 20న అరెస్ట్ చేసింది. వీరి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులిద్దరూ కర్నూలు సిటీ స్క్వేర్ మాల్లోని ఎస్వీసీ సినిమాస్‌లో కొత్తగా విడుదలైన సినిమాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి, Gofile వెబ్సైట్లో అప్లోడ్ చేసేవారు. వీరి వెనుక ఉన్న ప్రధాన నిందితుడు టెలిగ్రామ్ ద్వారా వీరిని సమన్వయం చేస్తూ, ఆ సినిమాలను వివిధ పైరసీ వెబ్సైట్లు, టెలిగ్రామ్ ఛానెళ్లలో అప్లోడ్ చేసేవాడు. ఈ పని చేసినందుకు వీరికి ఒక్కో సినిమాకు రూ. 20,000 చొప్పున క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించేవారు. ఆ తర్వాత నిందితులు దానిని భారత కరెన్సీలోకి మార్చుకునేవారు. అంతేకాకుండా, ఈ పైరసీ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లకు ప్రకటనలు ఇస్తూ భారీ మొత్తంలో అక్రమ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
Also Read
- Fire Accident : హఫీజ్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి బూడిద
- Baby Kidnapping : గాంధీ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
- Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
- New York Accident: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఉద్యోగం సాధించిన వారానికే మృత్యుఒడికి..
ఈ ముఠా పైరసీ చేసిన చిత్రాల్లో ‘రామాయణ’, ‘సీన్’, ‘మహాశక్తి’, ‘ఈఎన్ఈ’, ‘ఆకాశంలో ఒక తార’, ‘ఓం’, ‘కల్ట్’, ‘ఆదర్శ కుటుంబం’తో పాటు పలు ఇతర కొత్త సినిమాలు ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC), టీజీసీఎస్బీ సంయుక్త ఒప్పందంతో 2026 జనవరి 5న దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన యాంటీ పైరసీ యూనిట్ పైరసీ కట్టడిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు ఈ విభాగం 42,151 పైరసీ లింక్‌లను బ్లాక్ చేయడంతో పాటు, 87 హోస్టింగ్ సర్వర్లకు నోటీసులు జారీ చేసింది. గత 7 నెలల్లో 20కి పైగా సినిమాలకు సంబంధించి సుమారు రూ. 33.6 కోట్ల భారీ నష్టాన్ని నివారించగలిగింది. సవరించిన సినిమాటోగ్రాఫ్ చట్టం-2023, ఐటీ చట్టాల కింద పైరసీకి పాల్పడే వారికి కఠిన జైలు శిక్ష, భారీ జరిమానాలు తప్పవని టీజీసీఎస్బీ డైరెక్టర్ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ముఠాలోని మిగిలిన ప్రధాన నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Tamil Nadu: రైలు బోగీలో మహిళపై అత్యాచారం-హత్య.. నిందితుడ్ని 6 గంటల్లో పట్టించిన గోల్డ్ రింగ్!
-
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
-
Fire Accident : హఫీజ్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి బూడిద
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!