Teaser Release : ‘భవానీ వార్డ్ 1997’ టీజర్ విడుదల చేసిన సత్యం రాజేష్
- సత్యం రాజేష్ చేతుల మీదుగా భవానీ వార్డ్ 1997
- యూనిట్ కు బెస్ట్ విషెష్ తెలియజేసిన సత్యం రాజేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. థియేటర్లో అయినా ఓటీటీలో అయినా ఈ జానర్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా చూస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తోనే ‘భవానీ వార్డ్ 1997’ చిత్రం రాబోతోంది. హారర్, థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు ‘భవానీ వార్డ్ 1997’ అనే చిత్రం ఆడియెన్స్ ముందుకు త్వరలోనే రానుంది. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించిన ఈ మూవీకి జీడీ నరసింహా దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌లు ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను సత్యం రాజేష్ విడుదల చేశారు. అనంతర సత్యం రాజేష్ మాట్లాడుతూ.. టీజర్ చాలా బాగుందని చెబుతూ టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. గాడ్ విల్ ప్రకారం.. మనిషి చనిపోయిన తరువాత సోల్ ఆ దేవుడి దగ్గరకు వెళ్లాలి.. అలా వెళ్లకపోతే.. ఆ సోల్ ఈవిల్ స్పిరిట్‌గా మారిపోతుంది అనే డైలాగ్స్‌తో ప్రారంభమైన టీజర్.. ఆద్యంతం భయపెట్టేలా ఉంది. ఆ ఆత్మ ఏంటి? ఆ క్రైమ్ ఏంటి? అసలు ఇందులో సైకో విలన్ ఎవరు? అసలు ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు తలెత్తేలా టీజర్‌ను కట్ చేశారు. ఈ మూవీకి అరవింద్ బి కెమెరామెన్‌గా పని చేసారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!