Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కూడా అభిమానులుగానే ఉంటారు. అది ఆయన స్థానం మరి. ఇక బండ్ల గణేశ్ ఏ స్థాయి అభిమాని అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవికి తాను వీరాభిమానిని అంటూ ఎప్పుడూ చెప్పుకుంటాడు బండ్ల గణేశ్. అందుకు తగ్గట్టే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. తాజాగా తన ఇంట్లోనే దీపావళి పార్టీని ఏర్పాటు చేసి సినీ పెద్దలను ఆహ్వానించాడు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, సిద్దు జొన్నలగడ్డ, హరీష్ శంకర్,…
డైరెక్టర్ కొరటాల శివకు తెలుగులో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఆయన, తర్వాత చేస్తూ వస్తున్న సినిమాలన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటున్నాయి. ప్రస్తుతం ఆయన దేవర సినిమా పూర్తి చేసి, దేవర 2 సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, దేవర 2 సినిమా క్యాన్సిల్ అయిందని, దీంతో ఆయన మరో సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నారని ప్రచారం మొదలైంది. దానికి తోడు, నాగచైతన్యతో రెండు మీటింగ్స్ జరగడంతో,…
Pawan Kalyan : పవన్ కల్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను నిర్మాతగా కొనసాగనున్నట్టు తెలిపారు. ఆయన నటించిన తాజా మూవీ హరిహర వీరమల్లు జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నాడు పవన్. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను పంచుకున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలు చేస్తారా అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించగా స్పందించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో చాలా…
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈ రోజులు ఉదయం కన్నుమూశారు. మాగంటి రాజకీయాల్లోకి రాకముందు సినీ నిర్మాతగా నాలుగు చిత్రాలు నిర్మించారు. అదృష్టం కలిసిరాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్ గా సక్సెస్ కాలేకపోయిన ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మాగంటి గోపీనాథ్ సినిమా నేపథ్యాన్ని పరిశీలిద్దాం.. గోపీనాథ్ నాలుగు చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో 'పాతబస్తీ' చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాతగా ఇది మొదటి సినిమా.…
విశాఖపట్నం మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.. లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలో కూడా ఏక కాలంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
(ఆగస్టు 21న పి.ఆదినారాయణరావు జయంతి) సంగీత దర్శకుడు, నిర్మాత ఆదినారాయణరావు తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు. స్వరకల్పనలో వినసొంపైన రాగాలు కూర్చి జనం మదిని దోచారు. అభిరుచిగల నిర్మాతగా అనేక మరపురాని చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఆదినారాయణరావు నిర్మాత కాకపోయివుంటే మరింత మధురం తెలుగువారి సొంతం అయ్యేదని ఎందరో సంగీతప్రియులు అంటూ ఉంటారు. మాటలతోనే ఆరంభించి, పాటకు రాగం సమకూర్చడంలోనూ, పాటల్లోని పదాలను వీనులకు విందు చేసేలా విరచి, తన స్వరవిన్యాసాలతో అమృతం అద్దడంలోనూ ఆదినారాయణ…