ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ ప్రియురాలిని మోసం చేయాలని అతడు భావించాడు. కానీ ఈలోగానే ఆమె తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. ఐతే గర్భవతి అని కూడా చూడకుండా కర్కశంగా చంపేసి..డెడ్ బాడీని లోయలోకి నెట్టేశాడు. అంతా అయిపోయిందనుకున్నాడు. కానీ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు.. కేసును ఛేదించారు. నిందితున్ని కటకటాల వెనక్కి నెట్టారు. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు దుర్వాస్ పాటిల్. మరో ఫోటోలో ఉన్న యువతి పేరు భక్తి గరోధర్. మహారాష్ట్రలోని రత్నగిరి వీరి స్వస్థలం. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని భక్తితో చెప్పాడు దుర్వాస్ పాటిల్. దీంతో ఇద్దరూ శారీరకంగానూ దగ్గరయ్యారు. ప్రస్తుతం భక్తి గర్భవతి. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని పలుమార్లు కోరింది..
వాయిస్: కానీ.. దుర్వాస్ పాటిల్ మరో అమ్మాయితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన భక్తి గొడవ చేసింది. దీంతో దుర్వాస్ పాటిల్ ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. అదే రీతిలో స్కెచ్ వేశాడు. ఆమెను నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి హత్య చేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీ ఆనవాళ్లు దొరికితే కేస్ అవుతుందని.. పట్టుబడితే శిక్ష పడుతుందని.. మృతదేహాన్ని మాయం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇదే క్రమంలో ఆమె డెడ్ బాడీని అంబే లోయ వద్ద గైముఖ్ సమీపానికి తీసుకువెళ్లాడు. మరో వ్యక్తి సాయంతో డెడ్ బాడీని లోయలోకి విసిరేశాడు..
మరోవైపు భక్తి కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఆమె సోదరుడు హేమంత్ జితేంద్ర మయేకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. పలు ఆధారాలతో లవర్ దుర్వాస్ పాటిల్ హస్తం ఉండవచ్చని అనుమానించారు. అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఆమెను హత్య చేసినట్లు దుర్వాస్ చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అంతే కాదు లోయలో డెడ్ బాడీని పడేసినట్లు పోలీసులకు చెప్పాడు..
నిందితుడితో కలిసి పోలీసులు అంబే లోయ వద్దకు చేరుకున్నారు. మొత్తంగా 15 మంది స్థానిక యువకులతో కలిసి అక్కడ డెడ్ బాడీ కోసం శోధించారు. మొత్తంగా అరగంట సేపు శోధించి భక్తి డెడ్ బాడీని బయటకు తీశారు. అప్పటికే మృతి చెంది 15 రోజులు కావడంతో డెడ్ బాడీ కుళ్లిన స్థితిలోలభించింది. ఆమె వేసుకున్న పింక్ ఎంబ్రాయిడరీ దుస్తులు, చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా సోదరుడు హేమంత్ .. తన చెల్లెలు భక్తియేనని గుర్తించాడు… గతంలో 10 నెలల క్రితం ఓ యువకుడు ఇలాగే అదృశ్యమై హత్యకు గురయ్యాడు. అతడి హత్యలోనూ దుర్వాస్ పాటిల్ ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు భక్తిని అత్యంత దారుణంగా చంపేసిన దుర్వాస్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు…