సమాజంలో రోజురోజుకు కామాంధులు ఎక్కువైపోతున్నారు. ఎలాంటి వృత్తిలో ఉన్నాం.. ఎలాంటి పనులు చేస్తున్నామన్న విచక్షణ కూడా లేకుండా పోయింది. పోలీసులు, టీచర్లు, డాక్టర్లు ఇలాంటి గౌరవమైన వృత్తిలో ఉండికూడా కొంతమంది నీచమైన పనులకు పాల్పడుతున్నారు. చివరికి దేవుడు నమ్మి చర్చికి వచ్చిన భక్తులను కూడా ఫాదర్ లు వదిలిపెట్టకపోవడం శోచనీయం. తాజాగా ఒక సిస్టర్ ని పెళ్లి చేసుకొంటానని నమ్మించి ఒక ఫాదర్ మోసం చేసిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డికుంట హోసన్నా చర్చిలో దారా నటానియేలు అనే వ్యక్తి ఫాదర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ చర్చిలోనే ఒక యువతి సిస్టర్ గా దేవునికి సేవ చేస్తోంది. అయితే 5 నెలల క్రితం ఫాదర్ దారా నటానియేలు.. ఆ యువతిని లొంగదీసుకోవడానికి పెళ్లి పేరుచెప్పి నమ్మించాడు. అతని మాయమాటలు నమ్మిన యువతి, ఫాదర్ తో కలిసి 5 నెలలు సహజీవనం చేసింది. శృంగార కోరికలు తీర్చుకున్న ఫాదర్, యువతి పెళ్లి ఊసు ఎత్తగానే ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని అర్ధం చేసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.