Bihar: బీహార్‌లో దారుణం.. వరుడి ముందే వధువును గన్‌తో కాల్చిన ప్రియుడు
- బీహార్‌లో దారుణం
- వరుడి ముందే వధువును గన్‌తో కాల్చిన ప్రియుడు
- కెమెరాలో చిక్కిన దృశ్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో దారుణం జరిగింది. ఓ ప్రేమికుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. పచ్చని పెళ్లిమండపంలో రక్తపాతం చిందించాడు. తనకు దక్కలేదన్న కోపంతో దారుణానికి ఒడిగట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
బీహార్‌లోని బక్సర్‌లోని చౌసా గ్రామంలో గ్రాండ్‌గా వివాహ వేడుకలు జరుగుతున్నాయి. బంధువులు, అతిథుల రాకతో పెళ్లి మండపం కళకళలాడుతోంది. ఇక వరుడి కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నుంచి భారీ ఊరేగింపుతో వధువు గ్రామమైన చౌసాకు చేరుకున్నారు. వధూవరులిద్దరూ వేదికపై దండలు మార్చుకుంటున్నారు. ఇంతలోనే వధువుకు సంబంధించిన ప్రేమికుడు వేదిక దగ్గరకు వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. బుల్లెట్ నేరుగా వధువులోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. పెళ్లి వేడుక కాస్త గందరగోళంగా మారిపోయింది. ఏం జరుగుతుందో తెలియక అందరూ అక్కడ నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో తొక్కిసలాట కూడా జరిగింది. ఈ అలజడిలో ప్రేమికుడు అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.
ఇది కూడా చదవండి: UP: ఘజియాబాద్ పాఠశాలలో చిరుత హల్‌చల్.. విద్యార్థులు బెంబేలు.. వీడియో వైరల్
వధువు పరిస్థితి విషమంగా మారింది. రక్తపుమడుగులో ఉన్న వధువును హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం మరొక ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఈ ఘటనతో వధువు కుటుంబం విచారంలో మునిగిపోయింది. ప్రస్తుతం వివాహాన్ని నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని వీడియోలను పరిశీలించారు. బుల్లెట్ పేలగానే అతిథులు పారిపోయినట్లుగా కనిపించింది. ఈ పెళ్లి పట్ల వధువు ప్రియుడు అసంతృప్తిగా ఉన్నాడని.. ఇద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారని ముఫుసిల్ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Trump: నేను లేకుంటే పాక్ ప్రధాని షరీఫ్ చనిపోయేవాడు.. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Tags
- bihar
- Boyfriend shoots
- bride
- groom
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్‌లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!