Illegal relationship: అక్రమ సంబంధాలు పచ్చని పండెంటి కాపురంలో చిచ్చుపెడుతున్నాయి. జీవితాంతం కలిసిమెలిసి వుండాల్సిన భార్య,భర్తలు అక్రమ సంబంధాల కారణంగా జీవితాలను చిదిమేసుకుంటున్నారు. క్షణం సుఖం కోసం అడ్డుగా వున్న వారిని అడ్డుతొలిగించుకునేందుకు హతమార్చేందుకు వెనుకాడటం లేదు. అక్రమ సంబంధాల ఊబిలో పడి భార్య, పిల్లలను అతి కిరాతకంగా హతమార్చిన భర్త ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ రామచంద్ర కథనం మేరకు, తిరుపతి జిల్లా గురవరాజుపల్లె ఎస్టీ కాలనీకి చెందిన కుమార్, పావని రెండు. సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఏడాది క్రితం పుట్టిన కుమార్తె అమృతకు తన పోలిక రాలేదని భార్యను కుమార్ వేధించేవాడు.
అంతేకా కుండా పుత్తూరుకు చెందిన ఓ యువతిని రహస్యంగా వివాహం చేసుకున్నాడు. రెండో భార్య మోజులోపడి మొదటి భార్యను, బిడ్డను ఆడ్డు తొలగించుకునేందుకు గత ఆదివారం చేపలు పట్టుకుందామంటూ పావనిని రాళ్ల కాలువ వద్దకు తీసుకె ళ్లాడు. అక్కడ ఆమెను గాయపరిచి బిడ్డతో పాటు నీళ్లలో తోసి చంపేశాడు. మూడు రోజుల నుంచి కుమార్తె, మనవరాలు కన్పించకపోవడంతో పావని తల్లిదండ్రులు, కుమార్ను ప్రశ్నించారు. సమాధానం చెప్పకపోవడంతో నిన్న (బుధవారం) రేణిగుంట అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. విచారణలో భాగంగా భార్యాబిడ్డలను చంపిన స్థలానికి పోలీసులను కుమార్ తీసుకెళ్లాడు. అక్కడ కాలువలో తేలియాడుతున్న పావని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాప మృతదేహం కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రామచంద్ర వెల్లడించారు. కూతురి మృతదేహంతో కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
Supreme Court: హిజాబ్‌పై నిషేధంతో కర్ణాటకలో ఎంత మంది చదువు మానేశారు?