Bihar Thief: కదులుతున్న రైలులో చోరీకి యత్నం.. చుక్కలు చూపించిన ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Thief: రైలు, బస్సుల్లో వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తూనే ఉంటారు. ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. కదులుతున్న రైలులో ఉన్న ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్ చోరీ చేయాలనుకున్న దొంగకు భయంకరమైన అనుభవం ఎదురైంది. అప్రమత్తమైన ప్రయాణికులు అతడి చేయిని పట్టుకోవడంతో సుమారు పది కిలోమీటర్ల వరకు ఆ దొంగ రైలు కిటికీ బయటవైపు ప్రమాదకరంగా వేలాడాడు.
బిహార్‌లోని ఖగారియాలో ఈ సంఘటన జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన సెప్టెంబర్ 14న బిహార్‌లో చోటుచేసుకుంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్‌ను కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. రైలు సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్ దగ్గరకు రాగానే దొంగ మొబైల్ దొంగిలించేందుకు వ్యక్తి చేతిని పట్టుకున్నాడు. కానీ అక్కడే అతని ప్లాన్ బెడిసి కొట్టింది. మొబైల్ తీసుకుంటుండగా అప్రమత్తమైన ప్యాసింజర్ దొంగ చేతులను కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. ఆ రైలు ప్లాట్‌ఫామ్ చివరకు చేరిన తర్వాత మరింత వేగం పుంజుకుంది. అయితే ప్రయాణికులు దొంగ చేతిని వదిలిపెట్టలేదు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో దొంగ క్షమాపణలు కోరుతూ, చేతులు వదిలేయమని వేడుకున్నాడు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
మరింత గట్టిగా లోపలకు లాగి పట్టుకున్నారు. దీంతో ఆ దొంగ రైలు బోగి కిటికీ బయటవైపు ప్రమాదకరంగా వేలాడాడు. ఆ రైలు పది కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఖగారియా స్టేషన్ సమీపిస్తుండగా ఆ దొంగ చేతులను ప్రయాణికులు విడిచిపెట్టారు. దీంతో ఆ దొంగ అక్కడి నుంచి పారి పోయాడు. అదే కంపార్ట్మెంట్లోని కొందరు ప్రయాణికులు ఈ ఘటనను తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ప్రయాణికులు దొంగపై కాస్తా జాలి చూపించాల్సిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
Though #unverified yet chilling. A mobile snatcher caught in a moving train when his failed attempt probably led to his worst day of life. The thief was hung by a window in a moving train from Begusarai to Khagaria. The passengers handed him over to GRP. IS this act justified? pic.twitter.com/o3ja5qWggi
— Saurabh Rathore (@JournoKSSR) September 15, 2022
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!