ఎన్ని కఠిన చట్టాలొచ్చినా దొంగలు బుద్ధి మార్చుకోవడం లేదు. దొంగతనం కోసం ఎంత సాహసాలకైనా తెగిస్తున్నారు. తాజాగా ఒక దొంగ రైల్లో మొబైల్ దొంగతనం చేశాడు. అనంతరం వేగంగా వెళ్తున్న రైల్లోంచి దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Bihar Thief: రైలు, బస్సుల్లో వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దొంగలు తమ చేతి వాటాన్ని చూపిస్తూనే ఉంటారు. ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకి ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. కదులుతున్న రైలులో ఉన్న ప్రయాణికుల నుంచి మొబైల్ ఫోన్ చోరీ చేయాలనుకున్న దొంగకు భయంకరమైన అనుభవం ఎదురైంది. అప్రమత్తమైన ప్రయాణికులు అతడి చేయిని పట్టుకోవడంతో సుమారు…