Bengaluru: భర్త పక్కన నిద్రిస్తున్న వివాహితను చంపి రూ.65 లక్షల నగలు చోరీ.. ఇందులో ట్విస్ట్ ఏంటంటే..!
- బెంగళూరులో దారుణం
- వివాహితను చంపి రూ.65 లక్షల నగలు చోరీ
- హత్య కేసులో వెలుగులోకి వచ్చిన బిగ్ ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరాలు-ఘోరాలు ఆగడం లేదు. ఈజీ మని కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. మానవత్వం మరిచి ఘాతుకాలకు తెగబడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో వెలుగు చూసింది.
బెంగళూరులోని హీరాపూర్ ప్రాంతంలో 70 ఏళ్ల వృద్ధురాలు తన భర్త రంగనాథ్‌తో ఒంటరిగా జీవిస్తోంది. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడం.. పైగా 15 ఏళ్ల నుంచి మానసిక అనారోగ్యంతో రంగనాథ్ మంచానికే పరిమితం అయ్యాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఓ దుర్మార్గుడు ఘాతుకానికి ఒడిగట్టాడు.
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
హోల్‌సేల్ దుకాణ యజమాని శివకుమార్ వ్యాపారంలో రూ.8 లక్షలు అప్పుల పాలయ్యాడు. ఈ అప్పుల నుంచి బయట పడాలన్న దుర్దేశంతో వృద్ధ దంపతుల ఆస్తులపై కన్నేశాడు. నగలు కొట్టేసి అప్పులు తీర్చుకోవాలని ప్రణాళిక రచించాడు. అంతే కుట్రలో భాగంగా తెల్లవారుజామున 1:03 గంటల ప్రాంతంలో ఇంట్లోకి చొరబడి భర్త పక్కన పడుకున్న శోభను అత్యంత దారుణంగా చంపేసి ఆమె మెడలో ఉన్న రూ.65 లక్షల ఆభరణాలు దోచుకెళ్లాడు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోల హతం
అయితే రంగనాథ్‌కు వైద్యం చేసేందుకు ఫిజియోథెరపీ వైద్యుడు ఇంటికి వచ్చాడు. శోభ రక్తపుమడుగులో ఉండడం చూసి షాక్ అయ్యాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక పోలీసుల రాకతో స్థానికులంతా గుమిగూడారు. వారితో పాటే ఏమీ ఎరగనట్టుగా నిందితుడు శివకుమార్ అక్కడే ఉన్నాడు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి సమయంలో స్కూటీపై పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. నెంబర్ ప్లేట్‌ను బట్టి ట్రాక్ చేయగా శివకుమార్‌దిగా తేలింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకోగా నేరాన్ని అంగీకరించాడు. ఈ పరిణామంతో అందరూ అవాక్కయ్యారు. అప్పుల నుంచి బయట పడేందుకు ఈ హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హంతకుడే ప్రేక్షకుడిలా తిరగడంతో స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..