పిల్లలు చర్మం మృదువుగా, సున్నితంగా ఉంటుంది.
కాబట్టి చలిగాలి బారిన పడి చర్మం పగలటం, చర్మంపై దద్దుర్లు, చర్మం పొడిబారటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
అందుకే రోజూ రాత్రిపూట మాయిశ్చరైజర్లను రాయాలి. వాసనలు ఎక్కువగా ఉండి, రంగుల క్రీములను వాడకండి.
చిన్నపిల్ల పెదవులు పగలటం, మూతి చివర్లో మంటలు రాకుండా ఉండాలంటే వ్యాజిలీన్ రాయాలి.
డైపర్లను సకాలంలో చెక్ చేసుకోకపోతే చలికాలంలో ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది.
కూల్ డ్రింక్స్, పండ్లరసాలు, ఐస్‌క్రీమ్స్, కేక్స్‌లాంటి ఫుడ్‌కు దూరంగా ఉంచటం మంచిది.
పొరబాటున కూడా చల్లని ఆహారం, చల్లనీళ్లు తాగించకూడదు. ఎప్పుడూ తాజా ఆహారాన్నే తినిపించాలి.
ఎక్కువ సమయం స్నానం చేయించకూడదు. త్వరగా శరీరాన్ని పొడి గుడ్డతో తుడవాలి.
పొడిగా ఉండే దుస్తులనే వేయాలి. నిద్రపోయేప్పుడు ఉన్ని దుస్తులను కచ్చితంగా వేయాలి.
శరీరంపై విపరీతంగా ర్యాషెస్, తెల్లటి మచ్చల్లాంటివి కనపడితే వెంటనే చర్మనిపుణులను సంప్రదించాలి.