గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్.. ఈ సినిమా ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.మొదటి సారి రాంచరణ్,శంకర్ కాంబో లో సినిమా తెరకెక్కుతుండడం తో గేమ్ ఛేంజర్ సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరియు తెలుగు బ్యూటీ అంజలి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కావాల్సి వుంది. కానీ దర్శకుడు శంకర్ విశ్వ నటుడు కమల్ హాసన్ హీరో గా భారతీయుడు 2 సినిమా ను కూడా తెరకేక్కిస్తుండటం తో గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యం జరుగుతుంది. దీనితో రాంచరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆందోళన చెందుతున్నారు.
తమ హీరో వెండితెర పై కనిపించి ఇప్పటికే ఏడాది దాటి పోయిందని వెంటనే గేమ్ చేంజర్ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.రీసెంట్ గా ఈ సినిమా నుంచి “జరగండి జరగండి” పాటను దీపావళి కి విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ దానిని కూడా వాయిదా వేసి ఫ్యాన్స్ ను మరోసారి నిరాశ పరిచారు. దీనితో రాంచరణ్ ఫ్యాన్స్ దర్శకుడు శంకర్ పై ఎంతో కోపంగా వున్నారు. దీనితో గేమ్ చేంజర్ నుంచి త్వరలోనే ఒక అప్డేట్ అందిస్తామని నిర్మాత దిల్ రాజు ఇటీవల వెల్లడించారు.ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ మైసూరు లో జరుగుతోంది. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించనున్నారు.ఈ నేపథ్యంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిత్ర యూనిట్ తో కలిసి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. మైసూరు లోని అమ్మవారి ఆలయానికి చేరుకున్న రామ్ చరణ్ ప్రత్యేక పూజల ను నిర్వహించారు.