Extramarital Affair: ఆటో డ్రైవర్‌తో భార్య ఎఫైర్.. వేట కొడవలితో భర్త దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Man Attacked On Auto Driver With Axe For Having Close Relationship With Wife: ఒక ఆటోడ్రైవర్‌తో తన భార్య సన్నిహితంగా ఉండటం చూసి అనుమానం పెంచుకున్న భర్త.. ఓ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందనుకొని, ఆటో డ్రైవర్‌పై వేట కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఖానాపురంకు చెందిన ఏ.నాగరాజు, సతీష్ మంచి స్నేహితులు. నాగరాజు తన భార్యతో కలిసి రైతుబజార్‌లో కూరగాయలు విక్రయిస్తుండగా.. సతీష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాగరాజుతో ఉన్న స్నేహం దృష్ట్యా.. సతీష్ తరచుగా అతని ఇంటికి వెళ్తూ వస్తుంటాడు. ఈ క్రమంలోనే నాగరాజు భార్యతోనూ సాన్నిహిత్యం పెరిగింది.
Remi Lucidi: విషాదాంతంగా ముగిసిన సాహస యాత్రికుడి ప్రయాణం.. 68వ అంతస్తు నుంచి పడి..
Also Read
- Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
మొదట్లో నాగరాజు తన భార్య, సతీష్ మధ్య ఉన్న సాన్నిహిత్యంపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు కానీ.. రానురాను ఆ ఇద్దరి మధ్య చనువు పెరగడం చూసి, అతనికి డౌట్ వచ్చింది. తాను లేని సమయంలో ఆ ఇద్దరు తరచుగా కలుసుకోవడం కోసం.. వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందేమోనని అనుమానించాడు. దీంతో.. అతడు ఆ ఇద్దరిని మందలించాడు. తన భార్య నుంచి దూరంగా ఉండాలని సతీష్‌కి చెప్పాడు. అయినా.. ఆ ఇద్దరి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇద్దరు తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది గమనించిన నాగరాజుకి కోపం కట్టలు తెంచుకుంది. తన భార్య నుంచి దూరంగా ఉండమని మందలించినా వినకపోవడంతో.. సతీష్‌ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
Cessna 177: సముద్రంలో ల్యాండ్ అయిన విమానం.. కారణమిదే.. చివరికి ఏమైంది?
ఆదివారం సతీష్ ఖానాపురంలోని ఆటో అడ్డాలో కూర్చుని ఉన్నాడన్న సంగతి తెలుసుకొని.. నాగరాజు వేట కొడవలితో అక్కడికి వెళ్లాడు. సతీష్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే వేట కొడవలితో సతీష్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో సతీష్ కాలికి, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకోవడంతో.. ప్రాణాపాయం తప్పింది. సతీష్‌ని ఆసుపత్రికి తరలించారు. అటు, దాడికి పాల్పడిన తర్వాత నాగరాజు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. తన భార్యతో సతీష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే ఈ దాడికి పాల్పడ్డానని నాగరాజు అంగీకరించాడు.
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?