Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
- తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీకొట్టనున్న భారత్
- ‘ఫియర్లెస్ క్రికెట్’ ఆడుతాం అంటున్న హర్మన్‌ప్రీత్
- పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడిస్తాం అంటున్న భారత్ కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తన ప్రయాణాన్ని చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ప్రారంభించనుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడింది. జట్టు దూడుగా ఆడేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. టోర్నీ తొలి మ్యాచ్ (పాకిస్థాన్) నుంచే ‘ఫియర్లెస్ క్రికెట్’ ఆడాలన్నదే తమ లక్ష్యమని పేర్కొంది. ప్రపంచకప్‌కు ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడింది. వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన భారత్.. ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకు పోరాడి ఐదు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లు జట్టులో విశ్వాసాన్ని పెంచాయని హర్మన్‌ప్రీత్ తెలిపింది.
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కేవలం 36 బంతుల్లో 68 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేసింది. ఆమె ఇన్నింగ్స్ జట్టుకు పెద్ద సానుకూల అంశమని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ పేర్కొంది. క్రీజులో నిలబడగలిగితే మ్యాచ్‌ను ఎప్పుడైనా తమవైపు తిప్పుకునే సామర్థ్యం ఉందనే నమ్మకం రిచా ఇన్నింగ్స్‌తో పెరిగిందని తెలిపింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ పోరాడినా విజయానికి చేరుకోలేకపోయింది. దీనిపై స్పందించిన హర్మన్‌ప్రీత్.. మధ్య ఓవర్లలో కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమవడం వల్లే ఓటమి ఎదురైందని అంగీకరించింది.
Also Read
- Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ 'గోట్'గా మనోడే!
‘టీ20 క్రికెట్లో భాగస్వామ్యాలు చాలా కీలకం. రిచా అద్భుతంగా ఆడినా మిగతా బ్యాటర్లు ఆమెకు సరైన సహకారం అందించలేకపోయారు. అయితే ఆమె ప్రదర్శన జట్టుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు జట్టులోని ప్రతి ఒక్కరికి అవకాశమివ్వాలనే ఉద్దేశంతోనే వార్మప్ మ్యాచ్‌ల్లో మార్పులు చేశాం. టోర్నీకి ముందు అందరూ మ్యాచ్ ప్రాక్టీస్ పొందడం జట్టుకు ఉపయోగపడుతుంది’ అని హర్మన్‌ప్రీత్ చెప్పారు. గ్రూప్-ఏలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. టోర్నీ తొలి మ్యాచ్‌నే పాకిస్థాన్‌తో ఆడాల్సి రావడం పట్ల హర్మన్‌ప్రీత్ ఉత్సాహం వ్యక్తం చేసింది.
‘బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్‌తో ప్రపంచకప్ ప్రారంభించడం కంటే గొప్ప విషయం ఇంకేముంటుంది?. స్టేడియంలో అద్భుత వాతావరణం ఉండబోతోంది. ఆ మ్యాచ్ కోసం మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని హర్మన్‌ప్రీత్ చెప్పింది. భారత మహిళల జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 ప్రపంచకప్ గెలవలేదు. 2020లో ఫైనల్ చేరడం భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన. ఆ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఈసారి చరిత్ర సృష్టించి తొలి ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత జట్టు బరిలోకి దిగుతోంది.
ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నీగా నిలవనుంది. తొలిసారిగా 12 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 33 మ్యాచ్‌లు ఇంగ్లండ్‌లోని ఏడు వేదికల్లో జరగనున్నాయి. జూన్ 30, జూలై 2 తేదీల్లో సెమీఫైనల్స్ జరగగా.. జూలై 5న లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలీ, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!