మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జాల్నా జిల్లాలో బస్సు-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 17 మందికి గాయాలయ్యాయి. రాష్ట్ర రవాణా సంస్థ బస్సు గేవ్రాయ్ నుంచి జాల్నాకు వెళ్తుండగా అంబాద్ నుంచి నారింజ పండ్లతో వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు డ్రైవర్ ఓవర్‌టేక్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది.