నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కల పల్లి సమీపంలో పండుగ పూట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొనడంతో నలుగురి మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు వున్నారు. వీరంతా నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన వారుగా గుర్తించారు. నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వాసులుగా గుర్తించారు. ఐదుగురు కడప నుంచి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలోనే కారు…
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం రేగింది. సెలవుల విషయంలో జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు జవాన్లు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడ్డ జవాన్లను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మారాయిగూడెం వద్ద లింగంపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో ఘటన చోటుచేసుకుంది. మృతులు బిహార్‌కు చెందిన రాజమణి యాదవ్, డంజి బంగాల్‌కు చెందిన రాజుమండల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది.…
ఒక ప్రేమ జంట చేసిన ఒక పని నలుగురు ప్రాణాలు తీసింది.. ఈ దారుణ ఘటన మద్యప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చాంద్‌పూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడు.. బంధువుల పంక్షన్ లో ఒక బాలికను చూసి ఇష్టపడ్డాడు. కొద్దిరోజులు ఆమె వెనక తిరిగి ప్రేమ గురించి చెప్పాడు.. బాలిక కూడా ఒప్పుకోవడంతో కొన్నిరోజులు చెట్టాపట్టాలేసుకున్న జంట.. పెళ్లి చేసుకోవాలనుకొని నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెప్తే ఒప్పుకోరని ఎవరికి తెలియకుండా ఇంట్లో పారిపోయారు. బాలిక తన…