UP Crime: స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..
- యూపీ రాజధాని లక్నోలో దారుణం..
- స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 14 ఏళ్ల బాలిక కిడ్నాప్..గ్యాంగ్ రేప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Crime: అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పోక్సో, నిర్భయ వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ నిందితులకు భయం అనేదే లేకుండా పోయింది. ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
Also Read
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
స్కూల్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న బాలికను ఇద్దరు వ్యక్తులు బంధించి అత్యాచారానికి ఒడిగట్టారు. పాఠశాల నుంచి వచ్చే దారిలో నిందితులు ఆమెని కిడ్నాప్ చేసి హోటల్‌కి తీసుకెళ్లారు. ఆపై ఇద్దరూ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నిందితులు డానిష్, అమీన్లు పాఠశాలకు వెళ్లే మార్గంలో కారులో బాలికను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత లక్నోలోని కృష్ణా నగర్ ప్రాంతంలోని ఓ హోటల్‌కి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
నిందితులు బాలిక అసభ్యకరమైన వీడియోలను, అశ్లీల చిత్రాలను రికార్డ్ చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించారు. నిందితులు ఆమెను కారులో తీసుకువచ్చి ఇంటి ముందు తోసేశారు. ఈ విషయాన్ని బాలిక తన తండ్రికి చెప్పగా, సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు లక్నో సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేశవ్ కుమార్ తెలిపారు. హోటల్లో సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ సాగిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!