IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI 5th T20: నేడు బెంగళూరులోని చిన్నస్వామి ఎం.స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య ఐదో, నిర్ణయాత్మక టీ20 జరుగనుంది. ఈ సిరీస్ ప్రస్తుతం 2-2తో సమంగా ఉత్కంఠభరితంగా సాగుతోంది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 247 పరుగులు బాదిన వెస్టిండీస్ బ్యాటింగ్ దళం ప్రస్తుతం ఫామ్‌లో ఉంది. మరోవైపు మన బౌలర్లు మాత్రం నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నాలుగో మ్యాచ్‌లో మయాంక్ యాదవ్, అర్షదీప్ సింగ్ ఇద్దరూ చెరో 52 పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగించే విషయమే. అయితే గాయపడిన అర్షదీప్ సింగ్ స్థానంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ జట్టులోకి రావడం బౌలింగ్ విభాగానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. అదొక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పాలి. కొత్త బంతితో స్వింగ్ రాబట్టడంలో, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో భువికి ఉన్న అపారమైన అనుభవం.. వెస్టిండీస్ పవర్ఫుల్ టాప్ ఆర్డర్‌ను కట్టడి చేయడంలో కీలకం కానుంది.
అలాగే ఓపెనింగ్ జోడీలో కూడా మార్పు ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో నిలకడలేకుండా ఆడుతున్న అభిషేక్ శర్మ స్థానంలో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో కేవలం 23 బంతుల్లోనే విధ్వంసకరంగా 56 పరుగులు చేసి మంచి రిథమ్ అందుకున్న సంజూ శాంసన్, అదే ఫామ్‌ను ఈ డిసైడర్ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తాడని భారత్ గట్టిగా ఆశిస్తోంది. ఇక ఈ సిరీస్‌లో బ్యాట్‌తోనూ, బంతితోనూ విఫలమై ప్రభావం చూపలేకపోయిన అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ మళ్లీ ప్లేయింగ్ ఎలెవ్లోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
- Scene Review: సూర్య 'సీన్' రివ్యూ..
- Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
- AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతంపై ఈసీ కీలక ప్రకటన.. విశాఖ ఫస్ట్.. అల్లూరి లాస్ట్..!
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అంచనా వేసిన ప్లేయింగ్ ఎలెవెన్స్ విషయానికి వస్తే.. భారత్ జట్టులో సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ లేదా వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ ఆడే అవకాశం ఉంది.
అలాగే వెస్టిండీస్ అంచనా వేసిన జట్టులో షాయ్ హోప్ (కెప్టెన్ & వికెట్ కీపర్), జ్యువెల్ ఆండ్రూ, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, కీమో పాల్, షామర్ స్ప్రింగర్, గుడకేష్ మోతీ, షామర్ జోసెఫ్ బరిలోకి దిగనున్నారు.
తాజావార్తలు
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
Renu Desai: 14 ఏళ్లుగా ఇదే పరిస్థితి.. నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?
-
Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతంపై ఈసీ కీలక ప్రకటన.. విశాఖ ఫస్ట్.. అల్లూరి లాస్ట్..!
-
Delhi-NCR Air Pollution: ఢిల్లీలో గాలి పీల్చడం 30 సిగరెట్లు తాగినట్లేనా..? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!