IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs ZIM Women 1st T20: జింబాబ్వేతో రాయ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు అనుకోని షాక్ తగిలింది. కెప్టెన్ స్మృతి మంధాన జట్టు చివరికి తేరుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పూర్తి స్థాయి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ను తొలి విజయంతో ప్రారంభించింది. అయితే, తాము అనుకున్న రీతిలో మాత్రం మ్యాచ్ ఆడలేదని కెప్టెన్ స్మృతి మంధాన నిజాయితీగా అంగీకరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేను తక్కువ స్కోరుకే కట్టడి చేసినా, లక్ష్య ఛేదనలో భారత జట్టు ఆరంభంలో తీవ్రంగా తడబడింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన ఆమె.. ప్రాసెస్ పరంగా తాము అనుకున్న పద్ధతిలో ఆడలేకపోయినప్పటికీ, అంతిమంగా గెలుపు గెలుపేనని స్పష్టం చేసింది. ఈ మ్యాచ్‌లో కొందరి ప్రదర్శనలను ప్రత్యేకంగా అభినందించాలని, నందిని శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసిందని, అలాగే తొలి మ్యాచ్‌లోనే నికి ప్రసాద్ ఎంతో ప్రశాంతతను, పరిణతిని ప్రదర్శించిందని ప్రశంసించింది. ఇక దీప్తి శర్మ గురించి ప్రత్యేకంగా చెబుతూ, ఆమె చాలా కాలంగా ఇలాగే జట్టు కోసం నిలకడగా రాణిస్తోందని, క్రికెట్ ప్రపంచంలో ఆమె నిజమైన లెజెండ్ అని కొనియాడింది. ఈ గెలుపుతో సంతోషంగా ఉన్నప్పటికీ, జట్టుగా తాము ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని, నేర్చుకోవాల్సిన గుణపాఠాలు చాలా ఉన్నాయని అభిప్రాయపడింది.
కెప్టెన్‌గా తాను ముందుగా పరిష్కరించాలనుకుంటున్న సమస్యల గురించి జర్నలిస్టు అడగగా.. ఆ విషయాలపై ఇప్పటికే డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చలు జరిగాయని స్మృతి వెల్లడించింది. మైదానంలో త్వరలోనే ఆ మార్పుల ఫలితాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తాయని చెప్పింది. అయితే ప్రస్తుతానికైతే ఆ విషయాలను బయటపెట్టడానికి ఇష్టపడనని, సరైన సమయంలో అవన్నీ బయటపడతాయని తెలిపింది. ఇక, కొత్త ప్రత్యర్థితో ఆడటంలో కొన్ని ప్రత్యేక సవాళ్లు ఉంటాయని స్మృతి అంగీకరించింది. ముందస్తుగా ఎలాంటి అంచనాలు లేని జింబాబ్వే జట్టుతో ఆడటం కొంచెం ఇబ్బందికరమేనని, అయితే డెత్ ఓవర్లలో స్లో వేరియేషన్స్‌ను ఉపయోగించి తాము పరిస్థితులకు త్వరగానే అలవాటు పడ్డామని స్పష్టం చేసింది. మ్యాచ్‌కు ముందు జింబాబ్వేపై తగిన ప్రణాళికలు వేసుకున్నప్పటికీ, వీడియో ఫుటేజ్‌లను చూడటానికి, ప్రత్యక్షంగా మైదానంలో ఎదుర్కొని ఆడటానికి చాలా తేడా ఉంటుందని ఆమె వివరించింది. దీప్తి శర్మ ఆడిన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ఆమె చూపిన ఉత్సాహం, ధైర్యమే మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేశాయని స్మృతి తెలిపింది. దీప్తి బౌలర్లపైకి విరుచుకుపడుతూ దూకుడుగా ఆడటం వల్ల ప్రత్యర్థి బౌలర్లకు కుదురుకునే అవకాశం దక్కలేదని, వారిని ఏమాత్రం ఆధిపత్యం చెలాయించనివ్వలేదని చెప్పింది. మరో ఎండ్‌లో నిలబడి దీప్తి ఆడిన ఆ దూకుడును చూశాక, తనకు కూడా స్వయంగా షాట్లు ఆడేందుకు ఎంతో ఆత్మవిశ్వాసం వచ్చిందని స్మృతి పేర్కొంది. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు కేవలం 114 పరుగులు చేసింది. 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 19 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో దీప్తి శర్మ (49 పరుగులు), అరంగేట్రం చేసిన నికి ప్రసాద్ (39 నాటౌట్) అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 82 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో భారత్ మరో 26 బంతులు మిగిలి ఉండగానే గెలుపును అందుకుని, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సిరీస్‌లోని రెండో టీ20 మ్యాచ్ ఆదివారం ఇదే వేదికపై జరగనుంది.
Also Read
- Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
- AP Municipal Elections 2026: బ్యాలెట్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
- AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
- SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
-
BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
-
Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
-
AP Municipal Elections 2026: బ్యాలెట్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
-
EPFO 74th Foundation Day: EPFO శుభవార్త.. ఇక వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, రూ.1,000 వరకు పాత ఖాతాలకు ఆటో సెటిల్మెంట్!
-
INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!