UP Crime: అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పోక్సో, నిర్భయ వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ నిందితులకు భయం అనేదే లేకుండా పోయింది. ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.