Stock Market: మార్కెట్‌కు ట్రంప్ జోష్.. భారీ లాభాలతో దూసుకెళ్తోన్న సూచీలు
- దేశీయ స్టాక్ మార్కెట్‌కు ట్రంప్ జోష్
- భారీ లాభాలతో దూసుకెళ్తోన్న సూచీలు
- 40 రోజుల తర్వాత శాంతించిన పశ్చిమాసియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. 40 రోజుల తర్వాత పశ్చిమాసియా శాంతించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ కోలుకుంది. ప్రస్తుతం భారీ లాభాలతో దూసుకెళ్తోంది. ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు వేగంగా పుంజుకున్నాయి. బుధవారం మన మార్కెట్ కూడా భారీ లాభాలతో బోణీ కొట్టింది. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో దూసుకెళ్తున్నాయి. పైగా బుధవారం ఆర్బీఐ పాలసీ వెల్లడించనుంది. వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచొచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌కు మంచి జోష్ వచ్చినట్లుగా నిపుణులు భావిస్తున్నారు.
ప్రారంభంలో సెన్సెక్స్ 2,586 పాయింట్ల లాభపడి 77, 203 దగ్గర కొనసాగగా.. ప్రస్తుతం 2,605 పాయింట్ల లాభంతో 77,265 దగ్గర కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 781 పాయింట్లు లాభపడి 23, 905 దగ్గర కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా భారీ నష్టాలను ఎదుర్కొన్న ఇన్వెస్టర్లు.. ఒక్క దెబ్బతో లక్షల కోట్ల సంపద జేబుల్లోకి వచ్చి పడింది.
Also Read
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
ఇది కూడా చదవండి: Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. అంతేకాకుండా ప్రభుత్వంలోని కీలక నేతలంతా చనిపోయారు. ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్ భారీ నష్టాలను ఎదుర్కొంది. తాజాగా ట్రంప్ సీజ్‌పైర్ వ్యాఖ్యలతో మార్కెట్లు వేగంగా పుంజుకున్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!