RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Repo Rate Hike: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మూడు రోజుల పాటు నిర్వహించిన ద్రవ్యపరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) సమావేశం ముగిసింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రుణాలు తీసుకునేవారికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆర్బీఐ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తూ కీలక వడ్డీ రేటైన ‘రెపో రేటు’ను పెంచుతున్నట్లు ప్రకటించింది. దాదాపు 25 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) మేర పెంచడంతో రెపో రేటు ఇప్పుడు 5.50 శాతానికి చేరింది. నిజానికి గడిచిన దాదాపు మూడున్నరేళ్లుగా ఈ రేటు 5.25 శాతం వద్దే స్థిరంగా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయంతో హోమ్ లోన్లు, కార్ లోన్లు లేదా ఏవైనా ఇతర ఈఎంఐలు చెల్లిస్తున్న సామాన్యుల జేబులపై అదనపు భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది.
పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ మేఘాలు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతం పెరిగిపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం, ఇంధన ధరల భారం నుంచి నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఎంపీసీ సభ్యులందరూ కలిసి రెపో రేటును పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది 2026లో ఆర్బీఐ జరిపిన నాలుగో ఎంపీసీ సమావేశం ఇది. అంతకుముందు ఏప్రిల్, జూన్, ఆగస్టు నెలల్లో జరిగిన సమీక్షల్లో రెపో రేటును మార్చకుండా 5.25 శాతం వద్దే యథాతథంగా ఉంచారు. అయితే, ముడి చమురు ధరల్లో మంటలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని చూస్తుంటే ఈసారి ఆర్బీఐ ఖచ్చితంగా 25 బీపీఎస్ మేర వడ్డీ రేట్లను పెంచుతుందని ఆర్థిక నిపుణులు ముందే ఊహించారు. అందరూ అనుకున్నట్లుగానే ఇప్పుడు కేంద్ర బ్యాంక్ కూడా అదే నిర్ణయానికి ముద్ర వేసింది.
Also Read
- Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
- Bank Holidays: రాబోయే 2 నెలల్లో 33 రోజులు బ్యాంకులు బంద్! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
- RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
- SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
అసలు ఏమిటీ ‘రెపో రేట్’? దీనివల్ల సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? చాలా సులభంగా చెప్పుకోవాలంటే.. కమర్షియల్ బ్యాంకులు తమ అత్యవసర స్వల్పకాలిక అవసరాల కోసం ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీ రేటునే ‘రెపో రేట్’ అంటారు. ప్రతీ రెండు నెలలకోసారి ఆర్బీఐ ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ రేటు పెరిగినా తగ్గినా దాని ప్రభావం నేరుగా లోన్లు తీసుకున్న సామాన్యులపైనే పడుతుంది. ఆర్బీఐ రెపో రేటును పెంచితే బ్యాంకులు పొందే రుణాలు పెరుగుతాయి. దాంతో బ్యాంకులు ఆ భారానంతా తమ కస్టమర్లపైకి నెట్టేస్తాయి. ఫలితంగా మనం తీసుకునే హోమ్, పర్సనల్, కార్ లోన్లపై వడ్డీ రేట్లు పెరిగి ఈఎంఐలు పెరుగుతాయి. ఒకవేళ రెపో రేటును తగ్గిస్తే లోన్లు చౌకగా మారి ఈఎంఐ భారం తగ్గుతుంది. కానీ ఈసారి రేట్లు పెరగడంతో సామాన్యుల నెలవారీ బడ్జెట్‌పై దెబ్బపడనుంది.
తాజావార్తలు
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
-
Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
ట్రెండింగ్
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!