Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- సంపూర్ణ విజయం సాధించాం
- ఇరాన్ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- రెండు వారాలు కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్
- 40 రోజుల తర్వాత శాంతించిన పశ్చిమాసియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొత్తానికి 40 రోజుల తర్వాత పశ్చిమాసియా శాంతించింది. ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లుగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో మధ్యప్రాచ్యంలో వైమానిక, డ్రోన్, బాంబు దాడి శబ్దాలు ఆగిపోయాయి. నిన్నటి నుంచి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ నాగరికత అంతం చేస్తామని.. విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు, చమురు కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. చివరికి రెండు వారాల పాటు కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించడంతో అంతటా ఊపిరి పీల్చుకున్నారు.
ఇరాన్ ఒప్పందం అమెరికాకు ‘‘సంపూర్ణ విజయం’’గా ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో ట్రంప్ అన్నారు. ‘‘సంపూర్ణ విజయం సాధించాం. నూటికి నూరు శాతం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు.’’ అని కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు టెహ్రాన్‌కు రెండు వారాలు గడువు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. చర్చలకు ఇరాన్‌ను చైనా ఒప్పించిందని తాను నమ్ముతున్నట్లు ట్రంప్ చెప్పినట్లు ఏఎఫ్‌పీ నివేదించింది. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించేందుకు ఇరాన్‌ను చర్చల దగ్గరకు తీసుకురావడానికి చైనా సహాయపడిందని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. చర్చలకు ఒప్పించడానికి బీజింగ్ ప్రమేయం ఉందా అని అడిగినప్పుడు.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇరాన్ యురేనియం సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని ట్రంప్ అన్నారు.
ఇదిలా ఉంటే ఓ వైపు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించగా.. ఇంకోవైపు ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులు చేసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. బుధవారం తెల్లవారుజామున వెంటవెంటనే మూడు హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై దాడి చేసనట్లుగా సమాచారం.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. అంతేకాకుండా ప్రభుత్వంలోని కీలక నేతలంతా చనిపోయారు. ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి.
అయితే హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌ను అంతం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరానీయులంతా రోడ్లపైకి వచ్చారు. విద్యుత్ ప్లాంట్ల దగ్గర మానవహారాలుగా ఏర్పడి నిరసన తెలిపారు. మొత్తానికి 40 రోజుల తర్వాత కాల్పుల విరమణతో మధ్యప్రాచ్యం శాంతించింది.
ఇది కూడా చదవండి: IMD Rain Alert: ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ఇది కూడా చదవండి: Trump: చివరి నిమిషంలో ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. 2 వారాల కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్, కానీ..
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!