పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Loan EMI: పండుగ పూట మధ్యతరగతి ప్రజలకు, బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న వాళ్లకు ఆర్బీఐ కోలుకోలేని షాకిచ్చింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష (MPC)లో భాగంగా కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. దసరా సంబరాల్లో ఉన్న సామాన్యుడిపై ఇది నేరుగా పిడుగులా పడింది. ఆర్బీఐ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో అన్ని రకాల బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి, నెలవారీ ఈఎంఐల భారం మోయలేని స్థాయికి చేరనుంది. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉండటంతో దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయక తప్పలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లలో కోత ఉండే ప్రసక్తే లేదని గవర్నర్ తేల్చిచెప్పడంతో అప్పులు తీసుకున్న వారిలో మరింత ఆందోళన పెరిగింది.
నేరుగా హోమ్ లోన్లపై పడనున్న దెబ్బ
ఆర్బీఐ రెపో రేటును పెంచిన వెంటనే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును అమల్లోకి తీసుకురానున్నాయి. ముఖ్యంగా సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఫ్లోటింగ్ రేటుతో గృహ రుణాలు తీసుకున్న సామాన్య, మధ్యతరగతి వర్గాలపై ఈ ప్రభావం తక్షణం పడనుంది. ఉదాహరణకు, 20 ఏళ్ల కాలపరిమితితో రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్న వారికి ప్రతి నెలా ఈఎంఐ దాదాపు రూ.780 వరకు అదనంగా పెరగనుంది. కొత్తగా లోన్లు తీసుకునే వారికి వెంటనే ఈ భారం మొదలవుతుండగా, పాత ఎంసీఎల్ఆర్ (MCLR) రుణగ్రహీతలకు రీసెట్ గడువు ఆధారంగా కొన్ని నెలల తర్వాత వడ్డీ రేట్ల పెంపు బదిలీ కానుంది. ఈ పెంపు నేపథ్యంలో బ్యాంకులు వినియోగదారులకు రెండు మార్గాలను చూపించే అవకాశముంది. ఒకటి నెలవారీ ఈఎంఐ పెంచడం, రెండోది ఈఎంఐ అలాగే ఉంచి లోన్ చెల్లింపు కాలపరిమితిని (టెన్యూర్) పొడిగించడం. అయితే కాలపరిమితి పొడిగిస్తే దీర్ఘకాలంలో వడ్డీ రూపంలో బ్యాంకులకే భారీ మొత్తం చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంతవరకు ప్రి-పేమెంట్స్ (ముందస్తు చెల్లింపులు) చేస్తూ అదనపు వడ్డీ భారం నుంచి బయటపడాలని, తమ లోన్ స్టేట్మెంట్లను నిరంతరం పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, ఫిక్స్డ్ రేటుపై రుణాలు తీసుకున్న వారికి మాత్రం ఈ పెంపుతో ఎలాంటి ముప్పు ఉండదు.
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!