దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. ఈ వారం పలుమార్లు సూచీల్లో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. మొత్తానికి వారం ముగింపులో మాత్రం లాభాలతో ముగిసింది. శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. క్రమక్రమంగా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 759 పాయింట్లు లాభపడి 79,802 దగ్గర ముగియగా.. నిఫ్టీ 216 పాయింట్లు లాభపడి 24, 131 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.49 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: BiggBoss : బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. టికెట్ టు ఫినాలే ఎవరికి ఇచ్చిందో తెలుసా ?
నిఫ్టీలో భారతీ ఎయిర్‌టెల్, సిప్లా, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్స్ లాభపడగా… పవర్ గ్రిడ్ కార్ప్, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, నెస్లే, అపోలో హాస్పిటల్స్ నష్టపోయాయి. రియాల్టీ మరియు పీఎస్‌యూ బ్యాంక్ మినహా..ఆటో, ఎనర్జీ, ఫార్మా మరియు మీడియా 1-2 శాతంతో గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పెరిగాయి.
ఇది కూడా చదవండి: Bus Accident: రోడ్డుపై గింగిరాలు తిరిగిన బస్సు.. 9 మంది మృతి