దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. వరుసగా 10వ రోజు కూడా మార్కెట్ నష్టాలతో ముగిసింది. ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధంతో ఇన్లెస్టర్లలో గబులు మొదలైంది. దీంతో గత కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాలను ఎదుర్కొంటోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం అల్లకల్లోలం అయిపోయింది. ట్రంప్ నిర్ణయాలు కారణంగా మన మార్కెట్ కుదేలైపోయింది. వాణిజ్య యుద్ధ భయంతో ఇన్వెస్టర్లలో భయాందోళన నెలకొంది. దీంతో ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారమంతా భారీ నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు.. దానికి తోడుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాలకు బ్రేక్ పడింది. భారీ లాభాలతో సూచీలు ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ బుధవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా గ్రీన్‌లో కొనసాగాయి.
న్యూఇయర్ ఆరంభంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లో కొత్త జోష్ కనిపించింది. రెండు రోజుల పాటు సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇన్వెస్టర్ల ఉత్సాహతతో సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు కారణంగా ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం క్రమక్రమంగా పుంజుకుంటూ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కె్ట్‌కు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు ముందు సరికొత్త జోష్ వచ్చింది. గత ఐదు నెలల్లో ఎన్నడూ చూడని విధంగా సూచీలు రాకెట్‌లా దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చాయి.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా సూచీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. మొత్తానికి వారం రోజుల తర్వాత మంగళవారం మన మార్కెట్‌కు మంచి రోజులొచ్చాయి.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. గత వారమంతా భారీ నష్టాలు కారణంగా లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఈ వారమైనా మార్పు ఉంటుంది అనుకుంటే.. ఈ వారం కూడా అదే తంతు కొనసాగుతోంది.