Brian Nicol: స్టార్‌బక్స్ సీఈఓకు రూ. 948 కోట్ల ప్యాకేజీ!
- స్టార్‌బక్స్ తన ఇన్‌కమింగ్ సీఈఓ బ్రియాన్ నికోల్
- భారీ ప్యాకేజీని ప్రకటించిన కంపెనీ
- పనితీరు ఆధారిత ప్రోత్సాహకం కూడా అందజేయనున్న కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్‌బక్స్ తన ఇన్‌కమింగ్ సీఈఓ బ్రియాన్ నికోల్ కోసం భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం.. నికోల్‌కు $113 మిలియన్ల (రూ. 948 కోట్లు) అంచనా ప్యాకేజీని ఇవ్వబోతోంది. 50 ఏళ్ల నికోల్ యొక్క ప్యాకేజీలో $10 మిలియన్ల సైన్-ఆన్ బోనస్, $75 మిలియన్ల ఈక్విటీ గ్రాంట్ ఉన్నాయి. నికోల్ FY25 కోసం $23 మిలియన్ల వరకు అదనపు వార్షిక గ్రాంట్‌ను కూడా పొందవచ్చు. వార్షిక వేతనం 16 లక్షల డాలర్లు అని నివేదికలో పేర్కొంది. ఇది కాకుండా.. ఆయనకు $ 36 లక్షల నుంచి $ 72 లక్షల వరకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని పొందవచ్చు. జీతం, ప్రోత్సాహకాలు ఆయన ప్యాకేజీలో భాగమే. అయితే.. వార్షిక మంజూరు ఆ ప్యాకేజీ నుంచి వేరుగా ఉంటుంది. వారి ఆఫర్ లెటర్‌లో ప్రత్యేకమైన వసతి గురించి కూడా చర్చ ఉంది.
READ MORE: AP Rain Alert: ఏపీలో రెండు రోజుల పాటూ భారీ వర్షాలు.. పిడుగులు పడే ఛాన్స్..!
Also Read
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
నికోల్ స్టార్‌బక్స్ సీటెల్ ప్రధాన కార్యాలయానికి మారారు. అయితే.. అవసరమైనప్పుడు వచ్చి వెళ్లేందుకు ఆయన అంగీకరించారు.ఆయనకు వ్యక్తిగత డ్రైవర్‌తో కూడిన కారు ఇవ్వబడుతుంది. సీటెల్‌లో ఇల్లు కూడా అందజేశారు. దాని ఖర్చులను కంపెనీ బరిస్తుంది. స్టార్‌బక్స్ ప్రతినిధి ప్యాకేజీని సమర్థిస్తూ.. “బ్రియన్ నికోల్ మా పరిశ్రమలో చాలా ప్రభావవంతమైన ఉద్యోగుల్లో ఒకరిగా నిరూపించుకున్నారు. ఆయన వల్ల చాలా సంవత్సరాలుగా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను సమకూరాయి. స్టార్‌బక్స్‌లో వారి పరిహారం నేరుగా కంపెనీ పనితీరు.. మా వాటాదారులందరి భాగస్వామ్య విజయంతో ముడిపడి ఉంటుంది.” అని కంపెనీ పేర్కొంది.
READ MORE:Eating Apple: యాపిల్స్ ఈ వ్యక్తులు అస్సలు తినకూడదు.. జాగ్రత్త సుమా!
17 నెలల పాటు స్టార్‌బక్స్‌కు నాయకత్వం వహించిన లక్ష్మణ్ నరసింహన్ స్థానంలో నికోల్ నియమితులయ్యారు. ప్రస్తుతం కంపెనీ షేరు ధర 23.9% క్షీణించింది. ఫలితంగా మార్కెట్ క్యాప్ నష్టం $32 బిలియన్లకు చేరుకుంది. ఫార్చ్యూన్ ప్రకారం.. ప్రస్తుత సీఈవో చిపోటిల్ (మెక్సికన్ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ)లో అద్భుతంగా పనిచేశారు. ఆయన హయాంలో కంపెనీ షేరు ధర 800 శాతం పెరిగింది. ఇది కాకుండా లాభాల్లో దాదాపు 7 రెట్లు పెరిగింది. అందుకే స్టార్‌బక్స్ ఈ ప్యాకేజీపై బ్రియాన్‌ను నియమించుకుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!