Gold Rates Down: బంగారం ధరలు భారీగా పతనం.. మోడీకి థాంక్స్ చెప్పిన సీటీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని గతంలో ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపు ద్వారా వ్యాపారులు, ఆభరణాల తయారీదారులు పెట్టుబడిదారులు భారీ ఆర్థిక నష్టాల నుంచి బయటపడ్డారని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) పేర్కొంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ నవంబర్ 22న ఒక లేఖ రాసింది. ప్రధాని ఈ పిలుపు ఇచ్చిన సమయంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటిడకీ, తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గడంతో ఆ నిర్ణయం ఆభరణాల రంగానికి ,చిన్న వ్యాపారులకు ఎంతో మేలు చేసిందని ఆ వాణిజ్య సంస్థ అభిప్రాయపడింది.
‘మీ ముందుచూపు లక్షలాది మంది ఆభరణాల వ్యాపారులు, పెట్టుబడిదారులను అప్పుల ఊబిలో పడకుండా కాపాడింది’ అనే శీర్షికతో రాసిన ఈ లేఖలో ధరల తగ్గుదల వివరాలను సీటీఐ ప్రస్తావించింది. ప్రధాని పిలుపు ఇచ్చిన సమయంలో కిలో బంగారం ధర రూ. 1.90 కోట్లు ఉండగా, ప్రస్తుతం అది రూ. 1.25 కోట్లకు పడిపోయిందని, తద్వారా కిలోకు రూ. 65 లక్షల మేర ధర తగ్గిందని తెలిపింది. ఒకవేళ ఆభరణాల వ్యాపారులు అప్పటి అధిక ధరల వద్ద భారీగా నిల్వలు కొనుగోలు చేసి ఉంటే తీవ్రంగా నష్టపోయేవారని వివరించింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమాల ద్వారా బంగారం వ్యాపారం చేసే చిన్న వ్యాపారులు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు కూడా అధిక ధరల వద్ద కొనుగోళ్లు చేయకుండా జాగ్రత్త పడటం వల్ల లాభపడ్డారని పేర్కొంది.
Also Read
- Rachin Ravindra: చివరి రోజు ఆటపై రచిన్ రవీంద్ర కీలక వ్యాఖ్యలు.. ‘వారే మ్యాచ్‌ను మలుపుతిప్పారు’
- CM Vijay: రైతుల కన్నా హెయిర్స్టైల్పైనే ఎక్కువ శ్రద్ధ.. సీఎం విజయ్‌పై అన్నాడీఎంకే విమర్శలు!
- Winter Skin Care: చలికాలంలో డ్రై స్కిన్‌కు చెక్ పెట్టే మీగడ క్రీమ్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
- Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
ప్రారంభంలో ప్రధాని సూచనను వ్యతిరేకించిన వ్యాపారులు సైతం ఇప్పుడు దాని ప్రయోజనాలను గుర్తిస్తున్నారని సీటీఐ వెల్లడించింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో.. బంగారం ధరలు తగ్గడం వల్ల సామాన్య వినియోగదారులకు కూడా ఆభరణాల కొనుగోలులో పెద్ద ఊరట లభించిందని తెలిపింది. భవిష్యత్తులోనూ బంగారం, వెండి వంటి సున్నితమైన మార్కెట్ల విషయంలో వ్యాపారులు నష్టపోకుండా ఉండేందుకు ఇలాంటి సమయోచిత మార్గదర్శకత్వం అందించాలని ప్రధానిని కోరింది.
కాగా, అంతకుముందు రోజు లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లను నివారించాలని తాను చేసిన విజ్ఞప్తికి ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని గుర్తు చేసుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో 2026 మే 10న సికింద్రాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బంగారం కొనుగోళ్ల తగ్గింపు, ఇంధన పొదుపు, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం సహా ఏడు అంశాలపై ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Gold Rates Down: బంగారం ధరలు భారీగా పతనం.. మోడీకి థాంక్స్ చెప్పిన సీటీఐ..
-
Nasha Mukth Bharath : డ్రగ్స్ మహమ్మారిపై ‘బాహుబలి’ యుద్ధభేరి
-
Ramayana : ‘రామాయణ’ సినిమాపై భగ్గుమన్న విశ్వహిందూ పరిషత్.. తక్షణమే ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్!
-
Rachin Ravindra: చివరి రోజు ఆటపై రచిన్ రవీంద్ర కీలక వ్యాఖ్యలు.. ‘వారే మ్యాచ్‌ను మలుపుతిప్పారు’
-
CM Vijay: రైతుల కన్నా హెయిర్స్టైల్పైనే ఎక్కువ శ్రద్ధ.. సీఎం విజయ్‌పై అన్నాడీఎంకే విమర్శలు!
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!