Kalki 2898 AD Team Announces OTT Release Window time: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 సినిమా ఎంత పెద్ద హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత నెల 27వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా తదుపరి మైల్ స్టోన్ దిశగా పరుగులు పెడుతోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే దాదాపు మూడు వారాల వరకు పూర్తవుతుంది.
SIIMA 2024: సైమా 2024.. దసరా vs హాయ్ నాన్న.. నానితో నానికే పోటీ!
అయినా సరే చాలా చోట్ల ఇప్పటికీ హౌస్ ఫుల్స్ నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ గురించి సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తాము ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ కి అయితే సినిమాని అమ్మామో ఆ డిజిటల్ ప్లాట్ఫారంలో ఈ సినిమా రిలీజ్ అయిన 10 వారాల తర్వాత మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అంటే సినిమా రిలీజ్ అయిన రెండున్నర నెలల తర్వాత మాత్రమే కల్కి సినిమా ఓటీటీలోకి రాబోతోంది. కాబట్టి ఈ సినిమాని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్లలోనే చూడాల్సిందిగా సినిమా యూనిట్ చెబుతోంది. సుమారు 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ తన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలతో కలిసి నిర్మించారు.