Success Story: కష్టపడే తత్వం, తెలివితేటలు ఉంటే చాలా ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొని గొప్పగా మారొచ్చు. అందుకు ఈ దిల్‌ఖుష్‌కుమార్ జీవితమే ఓ ఉదాహరణ. పెద్దపెద్ద చదువులు చదివినా కొన్ని సార్లు రాని పేరు తన కష్టం, తెలివితో సాధించుకున్నాడు. రిక్షాపుల్లర్, సాధారణ డ్రైవర్, కూరగాయల వ్యాపారి స్థాయి నుంచి కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దేశంలో పేరొందిన ఐఐటీ, ఐఐఎం గ్యాడ్యుయేట్లకు తన సంస్థలో ఉద్యోగం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Read Also: Pope Francis: శృంగారం దేవుడిచ్చిన అనుభూతి.. పోప్ ఫ్రాన్సిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీహార్ రాష్ట్రంలోని ఓ కుగ్రామానికి చెందిన దిల్‌ఖుష్ కుమార్ ఇప్పుడు కోట్ల విలువైన రాడ్‌బెజ్ కంపెనీకి వ్యవస్థాపకుడు, సీఈవో. సహర్సా జిల్లాలోని బంగావ్ గ్రామానికి చెందిన దిల్‌ఖుష్ కుమార్ చదివింది కేవలం 12వ తరగతి మాత్రమే. సొంతంగా ఏదైనా చేయాలనే సంకల్పంతో బీహార్ లో టాక్సీ సేవలను అందించాలని అనుకున్నాడు. దీంతో అతడు రాడ్ బెజ్ ను ప్రారంభించారు. టాక్సీ సర్వీసులకు సంబంధించి స్టార్టప్ ను స్థాపించారు. ఉబర్, ఓలాలా కాకుండా 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికుల కోసం ఓ సర్వీస్ ప్రొవైడర్ సంస్థను స్థాపించారు. ఇలా దూర ప్రాంతాలకు ప్రయాణించాలనుకున్న ప్రయాణికులకు సేవలను అందిస్తున్నారు.
ఐఐటీ గౌహతి వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేట్లు రాడ్‌బెజ్‌లో పని చేసేందుకు నియమించుకున్నాడు. ఐఐఎంకు చెందిన గ్రాడ్యుయేట్లను పార్ట్ టైమ్ గా తన సంస్థలో నియమించుకున్నాడు. ఢిల్లీలో రిక్షా పుల్లర్ గా ఉండేవాడినని, పాట్నా వీధుల్లో కూరగాయలు అమ్మానని తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు కుమార్. ఒక గార్డు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన సమయంలో ఐఫోన్ సింబల్ ను కూడా గుర్తించలేకపోయానని, అసలు ఐఫోన్ చూడటం అదే తొలిసారని కుమార్ చెప్పారు. తన తండ్రి వద్ద నుంచి డ్రైవింగ్ నేర్చుకున్నానని, సెకండ్ హ్యాండ్ టాటా నానోతో రాడ్బెజ్ ప్రారంభించాడు. రాడ్ బెజ్ ప్రారంభించిన 6-7 నెలల్లో దిల్ కుష్ కుమార్ రూ. 4 కోట్ట ఫండింగ్ సేకరించాడు. మొదటి దశలో పాట్నా నుంచి బీహారన్ లోని ప్రతీ గ్రామానికి సేవలు అందిస్తున్నారు. రెండవ దశలో బీహార్లోని వివిధ నగరానలు కలుపుతూ టాక్సీ సేవలను అందిస్తున్నారు. బీహార్ లోని ప్రతీ గ్రామాన్ని టాక్సీతో అనుసంధానించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాడు.